Jio 5G Welcome Offer : జియో 5G వెల్‌కమ్ ఆఫర్.. ఇంతకీ ఇదేలా పొందాలి? ఎవరు అర్హులంటే?

Jio 5G Welcome Offer : భారత మార్కెట్లో ఎయిర్‌టెల్ (Airtel) 5G నెట్‌వర్క్‌ను లాంచ్ చేసిన కొన్ని రోజుల తర్వాత రిలయన్స్ జియో 5G సర్వీసులు నాలుగు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. స్వతంత్ర (SA) టెక్నాలజీలో పెట్టుబడితో వినియోగదారులు భారత్‌లో నిజమైన 5Gని ఆస్వాదించవచ్చని రిలయన్స్ పేర్కొంది.

Jio 5G Welcome Offer : జియో 5G వెల్‌కమ్ ఆఫర్.. ఇంతకీ ఇదేలా పొందాలి? ఎవరు అర్హులంటే?

Jio 5G Welcome Offer announced How to get the invite

Jio 5G Welcome Offer : భారత మార్కెట్లో ఎయిర్‌టెల్ (Airtel) 5G నెట్‌వర్క్‌ను లాంచ్ చేసిన కొన్ని రోజుల తర్వాత రిలయన్స్ జియో 5G సర్వీసులు నాలుగు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. స్వతంత్ర (SA) టెక్నాలజీలో పెట్టుబడితో వినియోగదారులు భారత్‌లో నిజమైన 5Gని ఆస్వాదించవచ్చని రిలయన్స్ పేర్కొంది. అయితే రిలయన్స్ జియో 5G సర్వీసులు, ధరల విషయంలో క్లారిటీ లేదు. సాంకేతికంగా ట్రయల్ ప్రాతిపదికన యూజర్లకు 5Gని అందించే కొత్త ‘Welcome Offer’ అందుకు కారణంగా చెప్పవచ్చు. జియో అందించే 5G సర్వీసుల్లో ఈ ఆఫర్‌కు ఎవరు అర్హులు? Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను ఎలా పొందాలనే దానిపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రస్తుతం, Jio నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Jio 5G Welcome Offer announced How to get the invite

Jio 5G Welcome Offer announced How to get the invite

రిలయన్స్ జియో 5G ఎక్కడ అందుబాటులో ఉంది?
దసరా సందర్భంగా అక్టోబర్ 5న రిలయన్స్ జియో 5Gని ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి అనే నాలుగు నగరాల్లో ప్రారంభించినట్లు తెలిపింది. అయితే ప్రారంభంలో జియో ‘True-5G’ బీటా ట్రయల్ దశగా కంపెనీ స్పష్టం చేసింది. అందరు వినియోగదారులు (ఈ నాలుగు నగరాల్లో కూడా) అర్హులు కారని గుర్తించుకోవాలి. జియో ఇన్వైట్ ప్రాతిపదికన ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఈ నాలుగు నగరాల్లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత Jio మరిన్ని నగరాల్లో సర్వీసులను ప్రారంభించింది. డిసెంబర్ 2023 నాటికి అన్ని జిల్లాలను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌కు ఎవరు అర్హులు, ఎలా పొందాలి? అనేది తెలియాల్సి ఉంది. 5Gకి సపోర్టెడ్ ఫోన్‌లు మాత్రమే హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆప్షన్ పొందుతాయి. మీ ఫోన్ 5G టెక్నాలజీకి సపోర్టు ఇస్తుందో లేదో చెక్ చేయడానికి, మోడల్ నంబర్‌ను కనుగొనాలి. అలాగే ఫోన్ స్పెసిఫికేషన్‌లను చూసేందుకు అధికారిక తయారీదారుల వెబ్‌సైట్‌కి వెళ్లండి. నిర్దిష్ట స్మార్ట్‌ఫోన్ కోసం 5Gలో ఏమీ లేకుంటే, మీ ఫోన్‌లో ఆప్షన్ ఉండదని చెప్పాలి. రెండవది.. జియో 5G సర్వీసుల కోసం Sign Up చేసేందుకు ఎలాంటి ప్రత్యేక ఛానెల్‌లను తెరవలేదు.

Jio 5G Welcome Offer announced How to get the invite

Jio 5G Welcome Offer announced How to get the invite

ఈ నాలుగు నగరాల్లోని కస్టమర్లను కంపెనీ ఎంపిక చేసి.. వారి 4G ప్లాన్‌ను ఆటోమేటిక్‌గా 5Gకి అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. వినియోగదారులు తమ సిమ్ కార్డ్‌లను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని గుర్తించుకోవాలి. భారత మార్కెట్లో జియో 4G సర్వీసులను ప్రారంభించినప్పుడు 90 రోజుల పాటు ఫ్రీగా సర్వీసులను పొందవచ్చు. అందులో భాగంగానే వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించింది. 5G వెల్‌కమ్ ఆఫర్ లేటెస్ట్ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎంపిక చేసిన జియో కస్టమర్‌లు ఆటోమాటిక్‌గా 5G నెట్‌వర్క్‌కి ఉచితంగా అప్‌డేట్ అవుతారు. ఎక్కువ మంది జియో యూజర్లు జియో 5G బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. Jio 5G ధర ఎంత? Jio 5G టారిఫ్‌లపై ఎలాంటి సమాచారాన్ని రివీల్ చేయలేదు. భారత్‌లో 2G-ముక్త్ (2G రహిత) దేశంగా మార్చడానికి జియో 5G సర్వీసులను సరసమైన ధరకే అందించాలని భావిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G Services : జియో 5G వెల్‌కమ్ ఆఫర్.. ఏయే నగరాల్లో ఎప్పుడంటే? జియో యూజర్లలో వారికి మాత్రమేనట..!