Jio 5G Services : జియో 5G వెల్‌కమ్ ఆఫర్.. ఏయే నగరాల్లో ఎప్పుడంటే? జియో యూజర్లలో వారికి మాత్రమేనట..!

Jio 5G Services : రిలయన్స్ జియో 5G సర్వీసులు ఇప్పుడు భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేశాయి. రిలయన్స్ జియో మొదట్లో ఎంపిక చేసిన నగరాల్లోనే 5G సర్వసులు అందుబాటులో ఉండనున్నాయి.

Jio 5G Services : జియో 5G వెల్‌కమ్ ఆఫర్.. ఏయే నగరాల్లో ఎప్పుడంటే? జియో యూజర్లలో వారికి మాత్రమేనట..!

Jio 5G service is now available List of cities, Welcome Offer, eligible users and other key details

Jio 5G Services : రిలయన్స్ జియో 5G సర్వీసులు ఇప్పుడు భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేశాయి. రిలయన్స్ జియో మొదట్లో ఎంపిక చేసిన నగరాల్లోనే 5G సర్వసులు అందుబాటులో ఉండనున్నాయి. Jio 5G బుధవారం (ఈరోజు) నుంచి నాలుగు నగరాల్లో అందుబాటులోకి వస్తుందని టెలికాం కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దసరా సందర్భంగా రిలయన్స్ జియో (Jio 5G) వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించింది. భారత్‌లో జియో 5G ఎలా అందుబాటులో వస్తుంది.. 5G నెట్‌వర్క్‌ని పొందే నగరాల లిస్టు ఏంటి? ఇతర కీలక వివరాలను వెల్లడించింది. అవేంటో ఓసారి చూద్దాం..

Jio 5G వెల్‌కమ్ ఆఫర్.. అంటే ఏమిటి? :
జియో 5G వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించింది. రిలయన్స్ జియో కస్టమర్‌లకు ఇన్విటేషన్ పంపుతుంది. అయితే ఇందరికి అందరికీ అందదు. జియో ఎందుకు ఇలా చేస్తోంది? ఇది కేవలం బీటా టెస్టింగ్ మాత్రమే. అందుకే రిలయన్స్ జియో ఇన్విటేషన్ సిస్టమ్‌ను ఎంచుకుంది. అంతా సజావుగా జరిగిన తర్వాత 5G నెట్‌వర్క్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అర్హులైన వారికి కంపెనీ “Jio 5G వెల్‌కమ్ ఆఫర్” మెసేజ్‌తో నోటిఫికేషన్‌ను పంపుతుంది. ఆ తర్వాత వారు 5Gని యాక్సెస్ చేసుకోవచ్చు.

Jio 5G service is now available List of cities, Welcome Offer, eligible users and other key details

Jio 5G service is now available List of cities, Welcome Offer, eligible users and other key details

దేశంలో జియో 5G సర్వీసు కోసం ఏదైనా మార్గం ఉందా? :
మీరు దేశంలో ఎక్కడ ఉన్నా జియో ఇన్విటేషన్ పొందే అవకాశం లేదు. కస్టమర్లను కంపెనీ లాటరీ రూపంలో ఎంపిక చేస్తుందని రిలయన్స్ జియో తెలిపింది. 5G సర్వీసులకు ప్రత్యేకమైన యాక్సస్ పొందే వారికి SMS, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తెలుసుకోవచ్చునని Jio స్పష్టం చేసింది.

Jio 5G నగరాల జాబితా ఇదే :
కేవలం ఇది బీటా టెస్ట్, కమర్షియల్ ఎక్స్‌పర్మెంట్ కాదని గుర్తించాలి. రిలయన్స్ జియో 4 నగరాల్లో మాత్రమే 5Gని అందిస్తోంది. జియో 5G సర్వీసు ఇప్పుడు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలలో అందుబాటులో ఉంది. రానున్న నెలల్లో మరిన్ని నగరాలకు విస్తరించాలని టెల్కో ప్లాన్ చేస్తోంది. ప్రతి కస్టమర్‌కు బెస్ట్ కవరేజ్, యూజర్ అనుభవాన్ని అందించడానికి నెట్‌వర్క్ కవరేజ్ గణనీయంగా పూర్తయ్యే వరకు యూజర్లు ఈ బీటా ట్రయల్‌ను పొందవచ్చునని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 2023 నాటికి భారత్‌లో ప్రతి రిమోట్ ప్రాంతాల్లో 5G సర్వీసులను అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు.

Jio 5G service is now available List of cities, Welcome Offer, eligible users and other key details

Jio 5G service is now available List of cities, Welcome Offer, eligible users 

Jio 5G కోసం కొత్త SIM కొనుగోలు చేయాలా? :
అవసరం లేదు. మీరు అలా చేయవలసిన పని లేదు. భారత్‌లో సరికొత్త, వేగవంతమైన నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేసేందుకు కస్టమర్‌లు ప్రస్తుత జియో SIM లేదా 5G హ్యాండ్‌సెట్‌ను మార్చాల్సిన అవసరం లేదని రిలయన్స్ జియో ధృవీకరించింది.

Jio 5G ప్లాన్ ధరలు ఎంత ఉండొచ్చుంటే? :
భారత మార్కెట్లో 5G జియో ప్లాన్ ధరలను రిలయన్స్ జియో ఇంకా ప్రకటించలేదు. కానీ, ప్రపంచంలోని ఏ టెలికామ్‌తో పోలిస్తే.. జియో 5G ప్లాన్‌లు అతి తక్కువ ధరలకు యూజర్లకు అందుబాటులో ఉంటాయని అంబానీ ప్రకటించారు. జియో యూజర్లు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రీమియం ధర చెల్లించకుండానే 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G Launch: రేపే జియో 5జీ సేవలు ప్రారంభం.. ఈ నాలుగు నగరాల్లో ట్రయల్ రన్.. అన్‌లిమిటెడ్ డాటా