×
Ad

Jio Best Offer : జియో బంపర్ ఆఫర్.. జస్ట్ రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌.. మీకూ మెసేజ్ వచ్చిందా? ఇలా చెక్ చేసుకోండి..!

Jio Best Offer : జియో అద్భుతమైన ఆఫర్.. కేవలం రూ. 1కే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌.. ఇది ఎలా పొందాలి? పూర్తి వివరాలివే..

Jio Best Offer

Jio Best Offer : జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 1కే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఆఫర్ బెనిఫిట్స్, ఏయే ప్రీమియం ప్లాన్‌కైనా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ఆఫర్ యాడ్ ఫ్రీ స్ట్రీమింగ్, 4K ప్లేబ్యాక్, డాల్బీ విజన్ HDR డాల్బీ అట్మోస్ ఆడియోను అందిస్తుందని తెలుస్తోంది.

మొబైల్ యూజర్లు తమ మల్టీ-డివైజ్ యాక్సెస్ (Jio Best Offer) కూడా పొందవచ్చు. మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, టాబ్లెట్‌లో ఒకేసారి కంటెంట్‌ను స్ట్రీమ్ చేయొచ్చు. ఇంతకీ ఈ ఆఫర్ నిజంగా అందుబాటులో ఉందా? జియో యూజర్లకు మాత్రమేనా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుందంటే? :
నివేదికల ప్రకారం.. ఈ ఆఫర్ ప్రధానంగా జియో సిమ్, జియోఫైబర్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, కొంతమంది మొబైల్ యూజర్లు జియోయేతర నంబర్లతో కూడా ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చట. ఈ ఆఫర్ 30 రోజుల ట్రయల్ అందుబాటులో ఉందని అంటున్నారు. ఆ తర్వాత సాధారణ సబ్‌స్క్రిప్షన్ రుసుము వర్తించవచ్చు. ఈ ఆఫర్ ప్రస్తుతం పరిమిత యూజర్లకు గ్రూపునకు పైలట్‌గా టెస్టింగ్ చేస్తున్నట్టు సమాచారం.

Read Also : New Electric SUVs : ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్.. ఈ కొత్త 4 ఎలక్ట్రిక్ SUV కార్లు మార్కెట్ షేక్ చేయబోతున్నాయి..!

ఇలా యాక్టివేట్ చేయొచ్చు :

  • ముందుగా, జియో లేదా హాట్‌స్టార్ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
  • ఆ తర్వాత, ‘My Space’ లేదా ‘Subscribe’ సెక్షన్ వెళ్లండి. రూ. 1 ప్రీమియం ప్లాన్ ఎంచుకోండి.
  • ఆ తర్వాత, యూపీఐ, డెబిట్ కార్డ్ లేదా ఏదైనా డిజిటల్ వ్యాలెట్‌తో రూ. 1 చెల్లించండి.
  • పేమెంట్ సక్సెస్ అయితే ప్రీమియం యాక్సెస్ వెంటనే యాక్టివేట్ అవుతుంది.
  • యాడ్ ఫ్రీతో పాటు 4K + డాల్బీ విజన్ అట్మోస్ సౌండ్ కంటెంట్ పొందవచ్చు.

జియో, డిస్నీ+ హాట్‌స్టార్ ఇంకా అధికారికంగా ఈ ఆఫర్‌ను ప్రకటించలేదు. మీ అకౌంటులో ఈ ఆఫర్ కనిపించకపోతే డోంట్ వర్రీ.. ఈ ఆఫర్ పైలట్ ప్రాతిపదికన పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇంకా, 30 రోజుల ట్రయల్ రన్ తర్వాత సాధారణ సబ్‌స్క్రిప్షన్ రుసుము వర్తించవచ్చు. పేమెంట్ చేసే ముందు అన్ని నిబంధనలు, షరతులను చెక్ చేయండి.

ఈ ఆఫర్‌ యాక్టివేట్ చేసి ఉంటే.. మీ అకౌంటులో వ్యాలిడిటీని చెక్ చేయండి. 4K క్వాలిటీ, డాల్బీ విజన్, అట్మోస్ మల్టీ-డివైజ్ స్ట్రీమింగ్‌కు ఫుల్ యాక్సెస్ పొందవచ్చు. జియో కాకుండా ఇతర నంబర్‌లతో సబ్‌స్క్రైబ్ చేసుకునే యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు.