Jio Offer : పండగ చేస్కోండి.. జియో బంపర్ ఆఫర్.. ఈ సింగిల్ ప్లాన్‌తో హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు!

Jio Offer : జియో సింగల్ రీఛార్జ్ ప్లాన్ ఇదిగో.. ఈ ప్లాన్‌తో ఏడాది పొడవునా అంటే.. 365 రోజులు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్ చాలా మంది జియో కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది.

Jio Offer

Jio Offer : జియో యూజర్లకు గుడ్ న్యూ్స్.. దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ జియో తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు కూడా జియో మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ఒకటి తీసుకొచ్చింది. ఈ సింగిల్ ప్లాన్ ఒకసారి తీసుకుంటే.. 30 రోజులు కాదు.. 90 రోజులు కాదు.. ఏకంగా 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు.

Read Also : APL Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం అప్లయ్ చేశారా.. ఇకపై 2 రేషన్ కార్డులు.. APL, BPL ఎవరికి ఏది ఇస్తారంటే?

ఈ రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ ఏడదంతా పొందవచ్చు. జియో సిమ్ కలిగిన యూజర్లు ఇకపై నెలవారీ రీఛార్జ్‌లతో ఇబ్బంది అవసరం లేదు. ఈ వార్షిక ప్లాన్‌ ఎంచుకుంటే చాలు.. మార్చి 2025 నుంచి మార్చి 2026 వరకు ఎలాంటి రీఛార్జ్ చేయనక్కర్లేదు.

జియో రూ. 3599 రీఛార్జ్ ప్లాన్
ఇంతకీ ఈ వార్షిక రీఛార్జ్ ప్లాన్ ధర ఎంతంటే? కేవలం రూ. 3599 మాత్రమే. ఈ ప్లాన్‌తో మీరు 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మీరు ఒక్కసారి మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. ఆపై సంవత్సరం మొత్తం రీఛార్జ్‌తో పనిలేదు. ఈ ప్యాకేజీలో లోకల్, STD రెండింటికీ అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజూ 100 ఫ్రీ SMS కూడా ఉన్నాయి.

ఈ 365 రోజుల ప్లాన్‌లో జియో డేటా అలవెన్స్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. మీకు మరింత డేటా అవసరమైతే.. ఈ ప్లాన్ బెస్ట్. వినియోగదారులు మొత్తంగా 912.5GB డేటాను పొందుతారు. మీరు ప్రతిరోజూ 2.5GB వరకు హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. మీ రోజువారీ లిమిట్ దాటాక ఇంటర్నెట్ 64Kbps స్పీడ్‌తో అందుబాటులో ఉంటుంది.

90 రోజుల ఫ్రీ జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ :
అదనంగా, ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ వార్షిక ప్లాన్ యూజర్లకు జియో కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. డేటా, కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు, మీరు హాట్‌స్టార్‌కు 90 రోజుల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందుకుంటారు.

Read Also : OnePlus 13R : అద్భుతమైన ఆఫర్.. వన్‌ప్లస్ 13పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు.. డోంట్ మిస్!

అయితే ఇది మొబైల్ ఫోన్లకు మాత్రమే పరిమితమని గమనించాలి. మీ ల్యాప్‌టాప్ లేదా టీవీలో జియో హాట్‌స్టార్‌ను యాక్సెస్ చేయలేరు. అందుకు ప్రత్యేక ప్లాన్ తీసుకోవాలి. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా కస్టమర్‌లు 50GB జియో AI క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా పొందవచ్చు.