APL Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం అప్లయ్ చేశారా.. ఇకపై 2 రేషన్ కార్డులు.. APL, BPL ఎవరికి ఏది ఇస్తారంటే?

APL Ration Cards : తెలంగాణలో ఇకపై రెండు రకాల రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. APL రేషన్ కార్డులను మళ్లీ ప్రవేశపెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. పూర్తి వివరాల కోసం..

APL Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం అప్లయ్ చేశారా.. ఇకపై 2 రేషన్ కార్డులు.. APL, BPL ఎవరికి ఏది ఇస్తారంటే?

APL Ration Cards

Updated On : March 24, 2025 / 12:09 PM IST

APL Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం అప్లయ్ చేసుకున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ఇకపై తెలంగాణలో రెండు రకాల రేషన్ కార్డులు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న (APL) కుటుంబాలకు రేషన్ కార్డులను ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే, రేషన్‌ కార్డులకు సంబంధించి పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు.

Read Also : Oxygen Galaxy : అత్యద్భుతం.. అదిగో.. ఆ గెలాక్సీలో ఆక్సిజన్.. విశ్వం గుట్టువిప్పిన సైంటిస్టులు.. భూమిపైలా జీవం సాధ్యమేనా?

రాష్ట్రంలో రెండు రకాల రేషన్ కార్డులను దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి (BPL) కార్డులు.. ఎగువన ఉన్నవారికి (APL) కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అలాగే, రేషన్ కార్డులను ట్రైకలర్‌లో (BPL) కార్డులను, గ్రీన్‌ కలర్‌లో (APL) కార్డులను పంపిణీ చేయడంపై పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ ఇటీవలే తెలిపారు.

ఏపీఎల్, బీపీఎల్ కార్డు కలర్లు ఏంటి? :
ప్రస్తుతం, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయి. వార్షిక ఆదాయం బట్టి అర్హులుగా పరిగణిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కలర్లలో కనీసం రెండు రకాల రేషన్ కార్డులను ప్రవేశపెట్టాలని పరిశీలిస్తోంది. బీపీఎల్ కుటుంబాల కార్డులు ట్రైకలర్‌లో వైట్ కలర్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, APL కుటుంబాల కార్డులు గ్రీన్ లేదా మరో కలర్ ఉండే అవకాశం ఉంది. ఈ అంశంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలకు రెండు కార్డుల సిస్టమ్ ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత APL కార్డులను నిలిపివేశారు. కొత్త రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు సిస్టమ్ మాత్రమే కొనసాగింది. ప్రస్తుతం, రేషన్ దుకాణాల ద్వారా ముతక రకం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. సరసమైన ధరలకు ఉప్పు, చక్కెర, వంటనూనె, పప్పుధాన్యాలు వంటి ఇతర ముఖ్యమైన నిత్యావసర వస్తువులను రేషన్ కార్డుదారులకు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఛత్తీస్‌గఢ్ రేషన్ కార్డు సిస్టమ్‌పై అధ్యయనం :
‘‘ఛత్తీస్‌గఢ్ రేషన్ కార్డు సిస్టమ్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఆ రాష్ట్రంలో వివిధ రకాల కార్డులు ఉన్నాయి. రెండు కార్డుల వ్యవస్థను పునరుద్ధరించడం లేదా కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాలా? అనేదానిపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రజలు బియ్యం కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని పొందడం వంటి ఇతర ప్రయోజనాల కోసం రేషన్ కార్డులను పొందుతున్నారు.

బియ్యం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం కార్డులు తీసుకునే వారిలో అసలైన BPL కుటుంబాలను వేరు చేసే పద్ధతులపై ప్రభుత్వం కృషి చేస్తోంది. రెండు కార్డుల వ్యవస్థ మళ్లీ అమల్లోకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి రకం బియ్యంపై ఆదా చేయొచ్చు. వచ్చే ఏప్రిల్‌లో ఉగాది తర్వాత రేషన్ కార్డుదారులకు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది’’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

Read Also : PM Internship Scheme 2025 : యూత్‌కి అద్భుత అవకాశం.. ఇంటర్న్ షిప్ గడువు 31 వరకే.. ఇలా అప్లయ్ చేయండి..!

సంక్షే పథకాల కోసం రేషన్ కార్డులు :
రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డులు చాలా ముఖ్యం. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటి ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డులను ముఖ్యంగా ఏపీఎల్ కేటగిరీని ఇతర సంక్షేమ పథకాలకు అనుసంధానించాలని యోచిస్తోంది. ఇప్పటికే, చేయూత పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల కోసం రేషన్ కార్డులు చాలా అవసరం.

ఏపీఎల్ కార్డులు జారీ చేసే అర్హత ప్రమాణాలపై కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. తెలంగాణలో ఒకటి, మరొకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఎంచుకునే అవకాశాన్ని ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.