Jio Recharge Plans
Jio Unlimited Offer : రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. టెలికం కంపెనీ అన్‌లిమిటెడ్ ఆఫర్ వ్యాలిడిటీని 25 మే 2025 వరకు పొడిగించింది.
Read Also : Lava Smartphone : లావా ఫోన్ అదుర్స్.. ఐఫోన్ 16 డిజైన్‌తో ఖతర్నాక్ ఫీచర్లు.. ధర కేవలం రూ.6499 మాత్రమే..!
ముందుగా మార్చి 17 నుంచి 31 మార్చి 2025 వరకు పొడిగించగా, ఆ తర్వాత 15 ఏప్రిల్ 2025 వరకు, 30 ఏప్రిల్ 2025 వరకు పొడిగించింది. ఐపీఎల్ ఫైనల్ మే 25న జరగనుంది. కంపెనీ ఈ అన్‌లిమిటెడ్ ఆఫర్‌ను మే 25 వరకు పొడిగించింది.
జియో అన్‌లిమిటెడ్ ఆఫర్
ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఈ ఆఫర్ రూ. 299 ప్రతిరోజూ 1.5GB లేదా అంతకంటే ఎక్కువ రోజువారీ డేటాను అందించే ప్లాన్‌లకు మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతానికి, ఈ ఆఫర్‌తో వచ్చే జియో కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.
జియో రూ.299 ప్లాన్ :
ఈ జియో ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 1.5GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో కంపెనీ అన్ని నెట్‌వర్క్‌లకు రోజుకు 100 ఉచిత SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ జియో హాట్‌స్టార్‌కు ఫ్రీ యాక్సెస్‌తో వస్తుంది. మీరు జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌లో 50GB ఫ్రీ స్టోరేజీ పొందుతారు.
జియో రూ.349 ప్లాన్ :
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మీకు ప్రతిరోజూ 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అర్హత కలిగిన వినియోగదారులకు కంపెనీ అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత SMS, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను కూడా పొందుతారు.
ఈ ప్లాన్ జియో హాట్‌స్టార్‌తో పాటు జియో టీవీకి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మీకు 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.
జియో రూ.449 ప్లాన్
ఈ జియో ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో, రోజుకు 3GB డేటా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అర్హత కలిగిన వినియోగదారులకు కంపెనీ అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది.
ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఫ్రీ SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా లభిస్తోంది. జియో హాట్‌స్టార్‌తో పాటు జియో టీవీని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ ప్లాన్ 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా అందిస్తోంది.