జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రివ్యూ ఆఫర్ యూజర్లంతా ఈజీగా మైగ్రేషన్ ప్లాన్ లోకి మారిపోవచ్చు. 7 రోజుల వ్యాలిడెటీతో ఈ మైగ్రేషన్ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. 100Mbps స్పీడ్ తో 50GB వరకు హైస్పీడ్ డేటా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ కు సంబంధించి యాక్టివేషన్ కోసం ఇప్పటికే జియో ఫైబర్ తమ ప్రివ్యూ ఆఫర్ యూజర్లకు SMSల ద్వారా మెసేజ్ పంపుతోంది. ఏడు రోజుల వ్యాలిడెటీ ముగిశాక జియో ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ కాస్త మైగ్రేట్ అవుతుంది.
తద్వారా అది పెయిడ్ ప్లాన్ కు పూర్తిగా మారిపోతుంది. ఇటీవలే కొత్త జియో ఫైబర్ కస్టమర్లకు ప్రివ్యూ ఆఫర్ రద్దు చేసిన కొద్దిరోజులకే ఈ కొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది కంపెనీ. జియో ఫైబర్ మైగ్రేషన్ ప్లాన్ కింద ఏడు రోజుల పాటు 100Mbps స్పీడ్, 50GB వరకు హైస్పీడ్ డేటా పొందవచ్చు.
ఈ డేటా లిమిట్ దాటిన తర్వాత డేటా స్పీడ్ 1Mbps కు పడిపోతుంది. జియో ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ యూజర్లకు ఈ మైగ్రేషన్ ప్లాన్ ఫ్రీగా అందిస్తోంది జియో ఫైబర్. ప్రత్యేకించి యూజర్లు ఈ మైగ్రేషన్ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జియోనే యూజర్లకు యాక్టివేషన్ ప్రాసెస్‌కు సంబంధించి SMSలు పంపిస్తోంది.
అర్హత కలిగిన యూజర్లు దాన్ని అంగీకరిస్తే సరిపోతుంది. మైగ్రేషన్ ప్లాన్ కు మారే సమయంలో యూజర్ ఏదైనా ప్లాన్ రీఛార్జ్ చేసినా వెంటనే యాక్టివేట్ అయిపోతుందని టెలికం టాక్ తెలిపింది. గత సెప్టెంబర్ నెలలోనే రిలయన్స్ జియో తమ యూజర్లకు ప్రివ్యూ ఆఫర్ ను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రివ్యూ ఆఫర్ యూజర్లంతా పెయిడ్ ప్లాన్లకు మైగ్రేట్ అవుతారని తెలిపింది.