Jio Yearly Plans : జియో యూజర్లకు పండగే.. 365 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీగా జెమిని ఏఐ ప్రో, OTTతో 2 సూపర్ ప్లాన్లు!
Jio Yearly Plans : జియో తమ యూజర్లను ఆకట్టుకునేందుకు 365 రోజుల వ్యాలిడిటీతో రెండు వార్షిక ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్ల ద్వారా ప్రతిరోజూ 2.5G డేటా, అన్ లిమిటెడ్ 5జీ కాలింగ్ బెనిఫిట్స్, ఉచితంగా మూవీలు, జెమిని ఏఐ ఫ్రీగా యాక్సస్ చేయొచ్చు.
Jio Yearly Plans
- జియోహాట్‌స్టార్ నుంచి 3 నెలల మొబైల్/టీవీ సబ్స్క్రిప్షన్ ఉచితం
- గూగుల్ జెమిని ఏఐ ప్రోకి ఫ్రీ యాక్సెస్ కూడా పొందొచ్చు
- జియోటీవీ, జియోక్లౌడ్ యాప్‌లకు కూడా ఫ్రీ యాక్సెస్
Jio Yearly Plans : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో లాంగ్ వ్యాలిడిటీతో రెండు స్పెషల్ యాన్యువల్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లతో యూజర్లకు అనేక బెనిఫిట్స్ అందిస్తాయి.
రీఛార్జ్ ప్యాక్‌లు, ఏడాది పాటు వ్యాలిడిటీ, డేటా లేదా ఎంటర్టైన్మెంట్ ప్యాకులపై టెన్షన్ అక్కర్లేదు. 365 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్లు (Jio Yearly Plans) అన్లిమిటెడ్ 5జీ, సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్, మరెన్నో ఫ్రీ బెనిఫిట్స్ అందిస్తాయి. జియో అందించే 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
జియో రూ. 3599 ప్లాన్ :
365 రోజుల వ్యాలిడిటీతో రూ. 3599 ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5GB డేటా పొందవచ్చు. మొత్తం 912.5GB డేటా ఎంజాయ్ చేయొచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, SMS బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. హై-స్పీడ్ డేటా లిమిట్ తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అవ్వదు. కానీ, డేటా స్పీడ్ వేగం 64 Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ అందిస్తుంది.
ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్‌కు 3 నెలల మొబైల్, టీవీ సబ్స్క్రిప్షన్ అందిస్తుంది. ఫ్రీగా గూగుల్ జెమిని ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ కూడా పొందొచ్చ. ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియోక్లౌడ్ యాప్ సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. జియోటీవీతో 365 రోజుల పాటు యాప్‌లో రకరకాల టీవీ షోలను చూడొచ్చ. జియోక్లౌడ్, అదనపు స్టోరేజ్ ఆప్షన్ కూడా పొందవచ్చు.
జియో రూ. 3999 ప్లాన్ :
జియో మరో వార్షిక ప్లాన్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ 365 రోజుల పాటు 2.5G డేటా పొందొచ్చు. ప్రతిరోజూ అన్ లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ పొందవచ్చు. రోజుకు 100 SMS బెనిఫిట్స్ ఫ్రీగా పొందవచ్చు. 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్/టీవీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. గూగుల్ జెమిని ఏఐ ప్రోకి ఫ్రీ యాక్సెస్ కూడా పొందొచ్చు. జియోటీవీ, జియోక్లౌడ్ వంటి యాప్‌లకు కూడా ఫ్రీ యాక్సెస్ అందిస్తుంది.
జియో ఈ ప్లాన్‌తో ఫ్యాన్‌కోడ్ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. తద్వారా యూజర్లు ఫ్యాన్‌కోడ్ OTT యాప్‌ను వాడొచ్చు. ఫార్ములా వన్ రేసింగ్ వంటి లైవ్ స్పోర్ట్స్ చూడొచ్చు. ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ మినహా రెండు ప్లాన్లు ఒకేలా బెనిఫిట్స్ అందిస్తాయి. పూర్తి వివరాల కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు.
