Jio is offering extra data benefits with some of its prepaid plans
Jio extra data plans : రిలయన్స్ జియో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లకు బోనస్ డేటాను అందిస్తోంది. మీరు కూడా అదనపు డేటా కోసం చూస్తుంటే.. ఈ రెండు బూస్టర్ డేటా ప్లాన్లను ఎంచుకోవచ్చు. రూ.399 ప్లాన్, రూ. 219 డేటా ప్లాన్లను కొనుగోలు చేయొచ్చు. ఈ రెండింటిలో మీకు నచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. అవేంటో ఓసారి లుక్కేయండి.
రూ. 399 ప్లాన్ :
సాధారణంగా అన్లిమిటెడ్ కాల్స్.. రోజుకు 100ఎస్ఎంఎస్, 3జీబీ రోజువారీ డేటాను కలిగి ఉంటుంది. ఇప్పుడు అదనపు ఖర్చు లేకుండా 6జీబీ అదనపు డేటాను పొందవచ్చు. రూ.61 డేటా వోచర్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు. అదనంగా, ఇప్పటికీ జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్, అన్లిమిటెడ్ 5జీ డేటా వంటి అన్ని ఇతర పెర్క్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే.. మీరు దాదాపు నెల రోజుల పాటు డేటాతో కనెక్ట్ అయి ఉండవచ్చు.
Jio offering extra data benefits
రూ.219 ప్లాన్ :
తక్కువ రీఛార్జ్ కోరుకునే వారికి ఇదే సరైన ప్లాన్. ఈ డేటా ప్లాన్ ద్వారా రోజువారీ డేటా 3జీబీ, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్లతో వస్తుంది. కానీ, ఇప్పుడు జియో రూ. 25 అదనంగా 2జీబీ బోనస్ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ 14 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ కింద JioTV, JioCinema, JioCloud సర్వీసులతో పాటు అన్లిమిటెడ్ 5G డేటాకు యాక్సెస్‌తో సహా రూ. 399 ప్లాన్‌కు సమానమైన పెర్క్‌లను కలిగి ఉంటుంది.
ఈ ప్లాన్లు కొన్ని ఇతర ప్లాన్ల కన్నా కొంచెం ఖరీదైనవి కావచ్చు. కానీ, అదనపు డేటా డేటా కోరుకునే యూజర్ల కోసం జియో ఈ కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. మీరు ఇప్పటికే 5జీ డేటాను కలిగి ఉంటే.. అదనంగా అన్లిమిటెడ్ 5జీ డేటాను కూడా పొందవచ్చు. జియో అదనపు డేటా ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ బెస్ట్ ప్లాన్ మీ వ్యక్తిగత అవసరాలు, బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ బూస్ట్ ఆప్షన్లతో జియో కనెక్టివిటీ గతంలో కన్నా సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు.