Reliance Jio Plans 2024 : రిలయన్స్ జియో కొత్త ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024’ ప్రీపెయిడ్ ప్లాన్.. ధర, డేటా బెనిఫిట్స్ మీకోసం..!

Reliance Jio Plans 2024 : రిలయన్స్ జియో 2024 హ్యాపీ న్యూ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద అదనపు వ్యాలిడిటీతో పాటు డేటాను కూడా పొందవచ్చు.

Reliance Jio Plans 2024 : రిలయన్స్ జియో కొత్త ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024’ ప్రీపెయిడ్ ప్లాన్.. ధర, డేటా బెనిఫిట్స్ మీకోసం..!

Reliance Jio launches Happy New Year 2024 prepaid plans

Reliance Jio Plans 2024 : భారత ప్రముఖ టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024’ని ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ పాత వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ప్రత్యేకంగా రూ. 2,999 ప్లాన్ మళ్లీ తీసుకొచ్చింది. సాధారణ 365 రోజుల వ్యాలిడిటీపై అదనంగా 24 రోజులు అందిస్తుంది. తద్వారా ఈ ఆఫర్ కింద మొత్తం 389 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్‌పై ప్రస్తుతం ఎలాంటి బెనిఫిట్స్ మార్పు లేదు. తక్కువ ఖర్చుతో వినియోగదారులకు మరింత వ్యాలిడిటీని అందిస్తుంది.

Read Also : Jio AirFiber Data Booster Plan : జియో ఎయిర్‌ఫైబర్ బూస్టర్ డేటా ప్లాన్ ఇదిగో.. 1000జీబీ డేటా పొందొచ్చు.. ధర ఎంతంటే?

389 రోజుల వరకు వ్యాలిడిటీ :
జియో వెబ్‌సైట్‌లోని నిబంధనలు, షరతుల పేజీ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. రూ.2,999 ఎంచుకునే వినియోగదారులు దీర్ఘకాలిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీ వోచర్‌ను పొందవచ్చు. ఈ వోచర్ ప్రారంభ 365 రోజుల వ్యాలిడిటీ వ్యవధి ముగిసిన తర్వాత ప్లాన్ వ్యవధిని 24 రోజుల పాటు పొడిగిస్తుంది. మొత్తం 389 రోజుల సర్వీస్ కొనసాగింపును అందిస్తుంది. ఈ ప్లాన్ కొనుగోలును వెబ్‌సైట్‌లోని జియో ప్రీపెయిడ్ ప్లాన్ పేజీ ద్వారా లేదా మైజియో అప్లికేషన్‌ని ఉపయోగించవచ్చు.

Reliance Jio launches Happy New Year 2024 prepaid plans

Reliance Jio Happy New Year 2024 prepaid plans

అదనంగా 24 రోజుల వ్యాలిడిటీ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌పై అందించే అదనపు 24 రోజులలోనూ కస్టమర్‌లు సాధారణ వ్యాలిడిటీ వ్యవధిలో లభించే అదే ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, వినియోగదారులకు రోజువారీ ధర రూ. 8.21 నుంచి రూ. 7.70కు తగ్గుతుంది. ఈ పొడిగించిన వ్యవధిలో యూజర్లు రోజుకు 2.5జీబీ 4జీ డేటాను పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ ఉన్నాయి. అంతేకాకుండా, అన్‌లిమిటెడ్ 5జీ డేటాకు యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే, 5జీ సర్వీసుల లభ్యత ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది. 5జీ నెట్‌వర్క్ కవరేజ్ ప్రాంతాల్లోని వినియోగదారులకు యాక్సస్ అందిస్తుంది.

ఒకే ప్లాన్‌లో గరిష్టంగా 14 ఓటీటీ యాప్స్ :
అదనంగా, ఈ ప్లాన్‌కు సబ్‌స్క్రైబర్‌లు జియోటీవీ జియోసినిమా, జియోక్లౌడ్ సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు. ముఖ్యంగా, ఈ ప్యాకేజీలో చేర్చిన జియోసినిమా సబ్‌స్క్రిప్షన్ ప్రీమియం వెర్షన్ కాదు. ప్రీమియం జియోసినిమా సబ్‌స్క్రిప్షన్‌పై ఆసక్తి ఉన్న వినియోగదారులు విడిగా రూ.1,499కి ప్లాన్ కొనుగోలు చేయాలి. మరోవైపు, జియోసినిమా పోర్టల్ ద్వారా జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఒకే ప్లాన్‌లో భాగంగా గరిష్టంగా 14 విభిన్న ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

Read Also : JioTV Premium Plans : జియో కొత్త జియోటీవీ ప్రీమియం ప్లాన్లు ఇదిగో.. మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్, ప్రారంభ ధర ఎంతంటే?