JioFiber Plans : జియోఫైబర్ 6 కొత్త ప్లాన్లు ఇవే.. జీరో ఫీజు ఇన్‌స్టాలేషన్..!

JioFiber Plans : రిలయన్స్ జియో ఇప్పటికే కొత్త పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం 6 కొత్త జియోఫైబర్ ప్లాన్‌ (new JioFiber plans)లను ప్రకటించింది.

Jio Launches 6 New Jiofiber Plans Starting At Rs 399 With Zero Installation Fee

JioFiber Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి జియోఫైబర్ సర్వీసులను అందిస్తోంది. రిలయన్స్ జియో ఇప్పటికే కొత్త పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం 6 కొత్త జియోఫైబర్ ప్లాన్‌ (new JioFiber plans)లను ప్రకటించింది. ఈ జియోఫైబర్ ప్రారంభ ప్లాన్‌లు రూ.399 నుంచి రూ. 3,999 వరకు అందుబాటులో వస్తున్నాయి. ఈ ప్లాన్‌లలో ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు ఉచితంగా సెట్-టాప్ బాక్స్, ఇన్‌స్టాలేషన్‌ అర్హత పొందవచ్చు. జియోఫైబర్ యూజర్ల కోసం మొత్తం 6 కొత్త ప్లాన్‌లు ఏప్రిల్ 22 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కొత్త JioFiber పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రూ. 399, రూ. 699, రూ. 999, రూ. 1499, రూ. 2499, రూ. 3999 ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్‌లు ఈ వారం చివరిలో అధికారిక వెబ్‌సైట్ MyJio యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

రిలయన్స్ జియో మరో కొన్ని ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. రూ. 100, రూ. 200 అదనంగా 14 ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ ప్లాన్‌లను కూడా ప్రకటించింది. ఈ ఎంటర్ టైన్మెంట్ యాప్‌లలో Disney+ Hotstar, Zee5, Sonyliv, Voot, Sunnxt, Discovery+, Hoichoi, Altbalaji, Eros Now, Lionsgate, ShemarooMe, Universal+, Voot Kids JioCinema ఉన్నాయి. జియో ఈ ప్లాన్‌లను ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ అని అంటోంది. ఈ కొత్త JioFiber పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ఏదైనా ఎంచుకునే కస్టమర్‌లు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రూ. 10,000 కన్నా ఎక్కువ విలువైన ఉచిత గేట్‌వే రూటర్, సెట్-టాప్ బాక్స్ ఇన్‌స్టాలేషన్‌ను పొందవచ్చు.

Jio Launches 6 New Jiofiber Plans Starting At Rs 399 With Zero Installation Fee 

కొత్త JioFiber పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వివరాలు
-JioFiber రూ. 399 ప్లాన్ 30mbps స్పీడ్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. అదనంగా, జియోఫైబర్ యూజర్లు నెలకు రూ. 100 అదనంగా చెల్లించడం ద్వారా 6 ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు. (entertainment plan). కస్టమర్‌లు నెలకు రూ. 200 అదనంగా చెల్లిస్తే (entertainment planతో పాటు) 14 యాప్‌లకు యాక్సెస్ చేసుకోవచ్చు.
– JioFiber రూ. 699 ప్లాన్ 100mbps స్పీడ్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. అదనంగా, యూజర్లు నెలకు రూ. 100 అదనంగా చెల్లించడం ద్వారా 6 ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లను యాక్సస్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి నెలా రూ. 200 అదనంగా చెల్లించడం ద్వారా 14 యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు.
– JioFiber రూ. 999 ప్లాన్ 150mbps స్పీడ్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో అందించే మొత్తం కంటెంట్‌ యాక్సెస్‌ అందిస్తుంది.
– JioFiber రూ. 1499 ప్లాన్ 300mbps స్పీడ్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు రూ.199 విలువైన నెట్‌ఫ్లిక్స్ బేసిక్ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
– JioFiber రూ. 2499 ప్లాన్ 500mbps స్పీడ్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ని అందిస్తుంది. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు రూ. 499 విలువైన నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్‌కు కూడా యాక్సెస్‌ను అందిస్తుంది.

ఇప్పటికే ఉన్న JioFiber పోస్ట్‌పెయిడ్ యూజర్లు MyJio యాప్‌ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఇలా ఎంచుకున్న కొత్త ప్లాన్‌కి అడ్వాన్స్ రెంట్ పేమెంట్ చేసుకోవచ్చు. అయితే, JioFiber ప్రీపెయిడ్ యూజర్లు ముందుగా MyJio యాప్‌లోకి ప్రీపెయిడ్ పోస్ట్‌పెయిడ్ మైగ్రేషన్‌ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత, OTPని నమోదు చేసి వివరాలను పొందవచ్చు. MyJio యాప్‌లో entertainment plan ఎంచుకోండి ఇలా ఎంచుకున్న ప్లాన్ కోసం అడ్వాన్స్ పేమెంట్ చేసుకోవచ్చు.

Read Also : Jio Vs Airtel Vs Vodafone : రూ.300లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు.. Daily Data బెనిఫిట్స్ మీకోసం..

ట్రెండింగ్ వార్తలు