Jio Gaming Plan : యూత్ కోసం స్పెషల్.. జియో కొత్త గేమింగ్ ప్లాన్ అదుర్స్.. రోజుకు 2GB డేటా, ఫ్రీ ఏఐ, OTT బెనిఫిట్స్
Jio Gaming Plan : రిలయన్స్ జియో రూ. 459 గేమింగ్ ప్లాన్ రోజువారీ 2GB డేటా, 61GB మొత్తం వినియోగం, అన్ లిమిటెడ్ కాల్స్ ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో జియోగేమ్స్, ఫ్యాన్‌కోడ్, స్నాప్‌చాట్+, గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్లు ఉంటాయి.
- Sreehari A
- Updated on- April 29, 2026 / 05:47 PM IST
Jio Launches Rs 459 Youth Gaming Plan
- జియో యూజర్ల కోసం సరికొత్త గేమింగ్ ప్లాన్
- రోజువారీగా 2జీబీ డేటా, ఫ్రీ ఏఐ, ఓటీటీ బెనిఫిట్స్
- రూ. 459కే యూత్ గేమింగ్ ప్లాన్ ఆఫర్
Jio Gaming Plan : జియో యూజర్లకు అదిరిపోయే ప్లాన్.. ముఖ్యంగా మొబైల్ గేమర్లకు పండగే.. రిలయన్స్ జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ‘యూత్ అండ్ గేమింగ్’ ప్లాన్ ధర రూ. 459కు లభిస్తోంది.
ఇందులో రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ వంటి (Jio Gaming Plan) ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణ డేటా. జియో ఈ ప్లాన్‌తో మొత్తం 61GB 5G డేటాను అందిస్తుంది. ఇందులో రోజువారీ వినియోగానికి 2GB డేటా, అదనంగా 5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది.
ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి?
మీ రోజువారీ డేటా ఒక్కసారిగా అయిపోతే ఈ అదనపు 5GB డేటా పొందవచ్చు. 5GB మొత్తం 28 రోజులకు ఒకేసారి లభించే ఆఫర్. అవసరమైనప్పుడు మాత్రమే డేటా వాడటం బెటర్. డేటాతో పాటు ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
Read Also : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. టాటా కార్లపై రూ. 3.50 లక్షల బంపర్ డిస్కౌంట్లు.. మీ ఫేవరెట్ కారు ఇదేనా?
కానీ, ఈ ప్లాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్‌లలో ఉంది. జియో ఈ ప్యాక్‌ను ప్రత్యేకంగా గేమింగ్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ కోసం తీసుకొచ్చింది. అందుకే, జియోగేమ్స్ , ఫ్యాన్‌కోడ్‌లకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది.
జియో బంపర్ డీల్ ఆఫర్లు :
ఈ ప్లాన్‌లో స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. సాధారణ యూజర్లకు లేని ప్రీమియం స్పెషల్ స్నాప్‌చాట్ ఫీచర్లను యూజర్లు పొందవచ్చు. జియో అందించే జియోటీవీ, జియోక్లౌడ్‌కు కూడా ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది. కానీ, ఈ ప్లాన్ స్పెషల్ ఫీచర్లతో పాటు కొన్ని బోనస్ ఆఫర్లు కూడా పొందవచ్చు.
గూగుల్ జెమిని ప్రో :
మీకు జియో హాట్‌స్టార్ మొబైల్‌కు 3 నెలల సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. కంపెనీ జియో ఏఐ క్లౌడ్‌లో 50GB ఫ్రీ స్టోరేజ్‌ను కూడా అందిస్తోంది. అలాగే, గూగుల్ జెమిని ప్రోకు 18 నెలల సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.
వాస్తవానికి ఈ జెమిని ప్రో అంచనా మార్కెట్ వాల్యూ సుమారు రూ. 35,100 ఉంటుంది. సరికొత్త ఏఐ టెక్నాలజీ వాడేవారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. మీరు రీఛార్జ్ చేసిన జియో నంబర్‌తో ఈ యాప్‌లోకి లాగిన్ అయితేనే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.
