Tata SUV Cars : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. టాటా కార్లపై రూ. 3.50 లక్షల బంపర్ డిస్కౌంట్లు.. మీ ఫేవరెట్ కారు ఇదేనా?
Tata SUV Cars : టాటా మోటార్స్ ఏప్రిల్ నెలలో కార్లపై రూ. 3.50 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. టాటా కర్వ్ ఈవీతో సహా పలు ఎలక్ట్రిక్ పెట్రోల్-డీజిల్ మోడళ్లపై డిస్కౌంట్లు లభ్యమవుతున్నాయి.
Tata SUV Cars offers
- టాటా SUV కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు
- ఈ ఏప్రిల్‌లో ఏకంగా రూ. 3.50 లక్షల వరకు డిస్కౌంట్
- టాటా కంపెనీ ప్యాసింజర్ వాహనాలపై అద్భుతమైన ఆఫర్లు
Tata SUV Cars : మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? టాటా మోటార్స్ మీ కోసం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఈ ఏప్రిల్‌లో టాటా కంపెనీ ప్యాసింజర్ వాహనాలపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.
ఏకంగా రూ. 3.50 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్లు వివిధ మోడళ్లు, వేరియంట్లకు (Tata SUV Cars) మాత్రమే వర్తిస్తాయి. అన్ని రకాల కస్టమర్లకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. కస్టమర్లు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ లాయల్టీ బోనస్‌లతో మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.
ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లు :
మీరు ప్రీమియం ఎలక్ట్రిక్ SUV కొనుగోలు చేయాలని చూస్తుంటే టాటా కర్వ్ బెస్ట్ మోడల్. ప్రస్తుతం ఈవీ కార్లపై టాటా కంపెనీ ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ఈ మోడల్ యూజర్లకు ఆకట్టుకునేలా ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, గ్రీన్ బోనస్‌లతో సహా రూ. 3.50 లక్షల వరకు మొత్తం బెనిఫిట్స్ అందిస్తుంది.
ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ. 17.49 లక్షల నుంచి రూ. 22.24 లక్షల మధ్య ఉంటుంది. బ్యాటరీ ఆప్షన్లలో 45kWh, 55kWh వేరియంట్లు ఉన్నాయి. ఇందులో భారీ బ్యాటరీ 400 నుంచి 425 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Read Also : Haier AI Tower AC : కొత్త ఏసీ కొంటున్నారా? AI టవర్ AC వచ్చేసింది.. 10 సెకన్లలో మీ ఇల్లంతా కూల్.. కూల్!
పెట్రోల్, డీజిల్ కార్లపై భారీ డిస్కౌంట్లు :
ఈవీ వాహనాలపై మాత్రమే కాకుండా, పెట్రోల్ డీజిల్ కార్లపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా హారియర్, టాటా సఫారీ టాటా కర్వ్ వంటి కీలక మోడళ్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లు రూ. 55వేల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. స్టైల్, పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఆకర్షణీయమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఎక్స్చేంజ్, లాయల్టీ బోనస్ :
ఇంజన్ ఆప్షన్లలో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ జీడీఐ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. వినియోగదారులకు వివిధ రకాల ఇంజన్ల నుంచి ఎంచుకోవచ్చు. అలాగే, టాటా పంచ్.ఈవీ, టాటా నెక్సాన్.ఈవీ, టాటా హారియర్.ఈవీలపై భారీ ఆఫర్లను అందిస్తోంది.
కంపెనీ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్ వంటి అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. మీ పాత కారును ఎక్స్ఛేంజ్ చేస్తున్నా లేదా ఇప్పటికే టాటా కస్టమర్ అయినా ఎక్కువ మొత్తంలో ఆదా చేసుకోవచ్చు.
