×
Ad

Jio Prepaid Plan : జియో యూజర్లకు పండగే.. రోజుకు 3GB డేటా, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ ఫ్రీగా చూడొచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోవడం బెటర్..!

Jio Prepaid Plan : జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ అదిరింది. ఈసారి జియో యూజర్ల కోసం ప్రత్యేకమైన ప్లాన్‌ ప్రవేశపెట్టింది. రోజుకు కాలింగ్, 3GB డేటా, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందిస్తోంది. 

Jio Prepaid Plan

Jio Prepaid Plan : జియో యూజర్లకు అద్భుతమైన ఆఫర్. రిలయన్స్ జియో అనేక బెనిఫిట్స్‌తో కూడిన సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ మెసేజ్‌లు, ఇంటర్నెట్ వంటి బెనిఫిట్స్ అందిస్తున్నాయి. జియో కూడా అనేక బెనిఫిట్స్‌తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది.

జియో యూజర్ల కోసం స్పెషల్ ప్లాన్‌ (Jio Prepaid Plan) కూడా ప్రవేశపెట్టింది. వాయిస్ కాలింగ్ మాత్రమే కాకుండా రోజుకు 3GB డేటాను మాత్రమే అందిస్తుంది. ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. ఈ జియో ప్లాన్ ధర, ఆఫర్లపై ఓసారి లుక్కేద్దాం..

జియో 3GB డేటా ప్లాన్ :
ఈ జియో ప్లాన్ ధర రూ. 1799తో 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 90 రోజుల పాటు ఫ్రీ జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 SMS బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ కింద కంపెనీ రోజుకు 3GB డేటాను అందిస్తోంది.

Read Also : Samsung Galaxy S25 FE : అమెజాన్‌లో కిర్రాక్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోన్ ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్!

నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ :
అదనంగా, ఈ ప్లాన్ యూజర్లకు ఫ్రీ ప్రైమరీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ కూడా అందిస్తుంది. అదనపు డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌కు సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.

జియో రూ. 1199 ప్లాన్ :
జియో మరో చౌకైన ప్లాన్‌ ఆఫర్ చేస్తుంది. రూ. 1799 ప్లాన్‌తో పాటు జియో చౌకైన రూ. 1199 ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో 3GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, ఈ ప్యాక్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉండదు. జియో హాట్‌స్టార్‌కు 3 నెలల ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.