Jio Prepaid Plans
Jio Prepaid Plans : రిలయన్స్ జియో యూజర్ల కోసం అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌లతో పాటు హై-స్పీడ్ ఇంటర్నెట్ (Jio Prepaid Plans) కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లపై అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ మాత్రమే కాదు.. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే వంటివి యాక్సెస్ చేయొచ్చు.
కేవలం రూ. 100 నుంచి ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. OTT బెనిఫిట్స్‌తో జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు లభ్యమవుతున్నాయి. ఫ్రీ డేటా, SMS కాలింగ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. జియో అందించే ఓటీటీ రీఛార్జ్ ప్లాన్‌లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
OTT బెనిఫిట్స్‌తో జియో రీఛార్జ్ ప్లాన్లు ఇవే :
జియో రూ.100 ప్లాన్ :
జియో 90 రోజుల (Jio Prepaid Plans) వ్యాలిడిటీతో 5GB 5G సపోర్టు డేటాను అందిస్తుంది. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ కంటెంట్‌కు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.
జియో రూ.445 ప్లాన్ :
జియో రూ. 445తో వినియోగదారులు 28 రోజుల పాటు రోజుకు 2 GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 రోజువారీ SMS పొందవచ్చు. ఈ ప్లాన్‌లో సోనీ లైవ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, ఫ్యాన్ కోడ్, సన్ NXT, ప్లానెట్ మరాఠి, కంచా లంకా, హోయిచాయ్, చాపల్ వంటి 9కి పైగా ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు. అలాగే JioTV, JioCloud స్టోరేజీకి కూడా ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.
జియో రూ.1,029 ప్లాన్ :
ఈ 84 రోజుల ప్లాన్ రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, ఫ్రీ అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా JioTV, JioCloud యాక్సెస్ కూడా పొందవచ్చు.
జియో రూ.1,049 ప్లాన్ (Jio Prepaid Plans) :
ఈ ప్లాన్ కొనుగోలుపై డేటా , వ్యాలిడిటీతో పాటు రూ.1,029 ప్లాన్ మాదిరిగానే మిగతా బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ ప్రైమ్ వీడియో కాకుండా ఫ్రీ సోనీ లివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది. వినియోగదారులు రోజువారీ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, జియో అందించే ఫ్రీ సర్వీసులను పొందవచ్చు.
రూ.1,299 ప్లాన్ :
ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, 84 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSతో పాటు JioTV, JioCloud యాక్సెస్‌ను అందిస్తుంది.