Vu Glo QLED TV : కొత్త టీవీ కావాలా నాయనా.. ఈ స్మార్ట్‌టీవీలను ఓసారి లుక్కేయండి.. మీ ఇంట్లో మినీ థియేటర్ ఉన్నట్టే.. ధర ఎంతో తెలుసా?
Vu Glo QLED TV : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి Vu టెలివిజన్స్ నుంచి సరికొత్త Glo QLED స్మార్ట్ టీవీలు వచ్చేశాయి..

Vu Glo QLED TV
Vu Glo QLED TV : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూసేవారికి గుడ్ న్యూస్.. రాబోయే పండుగ సీజన్ కోసం వియూ టెలివిజన్స్ సరికొత్త ప్రీమియం లైనప్ వియూ (Vu Glo QLED TV) జీఎల్ఈ క్యూఎల్ఈడీ టీవీ 2025 (డాల్బీ ఎడిషన్)ను ఆవిష్కరించింది. ఈ సిరీస్ హై-ఎండ్ ఫీచర్లతో వస్తుంది.
మీ హోమ్ ఎంటర్టైన్మెంట్ సెటప్ అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్. 43-అంగుళాల టీవీ మోడల్ ధరలు రూ. 24,990 నుంచి లభ్యం కానున్నాయి. టాప్-ఎండ్ 75-అంగుళాల వేరియంట్ రూ. 64,990 నుంచి పొందవచ్చు. వియూ జీఎల్ఓ క్యూఎల్ఈడీ టీవీ ధర, లభ్యత, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
క్యూఎల్ఈడీ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌టీవీలు A+ గ్రేడ్ గ్లో QLED ప్యానెల్ కలిగి ఉంటాయి. 400 నిట్స్ బ్రైట్‌నెస్, 92శాతం NTSC కలర్ కవరేజ్, డాల్బీ విజన్, HDR10, HLG సపోర్టు అందిస్తాయి. మూవీలు, క్రీడలు రెండింటికీ పవర్‌ఫుల్ కలర్లు, ఆకర్షణీయమైన కాంట్రాస్ట్‌ను అందిస్తుంది.
సౌండ్ ఇంటర్నల్ 24W డాల్బీ అట్మాస్ సిస్టమ్ కలిగి ఉంది. సినీమా థియేటర్ మాదిరిగా ఫీల్ అవ్వొచ్చు. హుడ్ కింద, 1.5GHz VuOn ఏఐ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతాయి. 2GB ర్యామ్, 16GB స్టోరేజీ కలిగి ఉంది.
గూగుల్ టీవీ OSపై రన్ అవుతాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ఈజీగా యాక్సస్ చేయొచ్చు. పర్సనలైజడ్ కంటెంట్ కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో ఆపిల్ ఎయిర్‌ప్లే, హోంకిట్, గూగుల్ క్రోమ్‌క్యాస్ట్, బ్లూటూత్ 5.3, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi ఉన్నాయి. గేమర్స్ VRR, ALLM, లాగ్‌ను తగ్గించేందుకు క్రాస్‌హైర్ ఫంక్షన్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా పరిశీలిస్తే.. Vu స్పెషల్ Wi-Fi హాట్‌కీతో ఇన్‌స్టంట్ నెట్‌వర్క్ రిమోట్‌ను అందిస్తోంది.
ధర ఎంతంటే? :
43 అంగుళాలు : రూ. 24,990
50 అంగుళాలు : రూ. 30,990
55 అంగుళాలు : రూ. 35,990
65 అంగుళాలు : రూ. 50,990
75 అంగుళాలు : రూ. 64,990
ఎక్కడ కొనొచ్చంటే? :
ఈ స్మార్ట్‌టీవీ మోడల్స్ ఆగస్టు 12, 2025 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, భారత్ అంతటా రిటైల్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. అన్ని మోడళ్లు ఒక ఏడాది వారంటీతో లభిస్తున్నాయి.