Samsung Galaxy A55 5G : ఇది కదా ఆఫర్ అంటే.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy A55 5G : ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ ధర తగ్గింది. ఈ అద్భుతమైన అసలు మిస్ చేసుకోవద్దు.. ఎంత తగ్గిందో తెలుసా?

Samsung Galaxy A55 5G
Samsung Galaxy A55 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో (Samsung Galaxy A55 5G) ధరను రూ.13,500 కన్నా భారీగా తగ్గింది.
ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ డీల్ అసలు వదులుకోవద్దు. శాంసంగ్ A-సిరీస్ ఫోన్లలో ఇదే బెస్ట్ ఫోన్. ఈ ఫ్లాగ్‌షిప్ డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ తగ్గింపు ధరకు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ A55 5G ఆఫర్ :
ఇటీవల భారత మార్కెట్లో శాసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ రూ.39,999కి లాంచ్ కాగా, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.26,483కి లభిస్తోంది. అంటే.. ధర రూ.13,516 తగ్గింపు పొందింది. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ ద్వారా రూ.750 క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీ పాత ఫోన్‌తో ఇంకా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫీచర్లు Samsung Galaxy A55 5G :
ఈ శాంసంగ్ 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 1000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, బ్యాక్ సైడ్ 5MP మాక్రో లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల విషయానికి వస్తే.. 32MP ఫ్రంట్ కెమెరా, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ కలిగి ఉంది.