Flipkart Independence Day Sale : ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే సేల్ డేట్ ఇదే.. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్లపై బిగ్ డీల్స్.. బ్యాంకు డిస్కౌంట్లు కూడా..!

Flipkart Independence Day Sale : ఆగస్టు 13 నుంచే ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ సేల్ మొదలు కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్లపై డీల్స్ ఇవే..

Flipkart Independence Day Sale : ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే సేల్ డేట్ ఇదే.. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్లపై బిగ్ డీల్స్.. బ్యాంకు డిస్కౌంట్లు కూడా..!

Flipkart Independence Day Sale

Updated On : August 12, 2025 / 5:46 PM IST

Flipkart Independence Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఇండిపెండెన్స్ సేల్ తేదీని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ వార్షిక సేల్ ఆగస్టు 13 నుంచి (Flipkart Independence Day Sale) ప్రారంభమవుతుంది. ఈ-కామర్స్ దిగ్గజం స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, అప్లియన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ, ప్రొడక్టులు, డివైజ్‌లు, హోం అప్లియన్సెస్, కిచెన్ సహా వివిధ కేటగిరీలలో ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్‌లను అందిస్తుంది.

అన్ని డీల్‌లలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌లు భారీ డిస్కౌంట్‌లతో లభిస్తాయి. ధర తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్ డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్, ఫ్రీ డిస్కౌంట్లు మరిన్నింటిని కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ సేల్ 2025కు సంబంధించి ఇప్పటివరకు కొన్ని పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే సేల్ 2025 తేదీ :
ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే సేల్ 2025 ఆగస్టు 13న ప్రారంభమై ఆగస్టు 17వరకు 5 రోజులు అందుబాటులో ఉంటుంది.

Read Also : Independence Day 2025 : ఈసారి ఎర్రకోటలో ఇండిపెండెన్స్ డే వేడుకలకు వెళ్లాలని ఉందా? ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫుల్ ప్రాసెస్..!

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు :
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇంకా డీల్స్‌ను వెల్లడించలేదు. లక్షలాది మంది డీలర్లు, తయారీదారులు, స్టార్టప్‌లు, బ్రాండ్‌ల ప్రొడక్టులపై ఆఫర్లను పొందవచ్చు. కెనరా బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీల ద్వారా చేసే పేమెంట్లపై కొనుగోలుదారులు 10శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ-కామర్స్ సైట్ స్మార్ట్‌ఫోన్‌లపై క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా ప్రకటించింది.

స్మార్ట్‌ఫోన్‌లపై టాప్ డీల్స్ :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ S24, ఐఫోన్ 15, పిక్సెల్ 8a వంటి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఇందులో బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ రూ.80వేల కన్నా తక్కువ ధరకు లభిస్తుంది.

అయితే, ఐఫోన్ 15 రూ.60వేల కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 FE, ఒప్పో రెనో 14, వివో T4 అల్ట్రా వంటి మిడ్-రేంజ్ ఫోన్లపై కూడా అద్భుతమైన డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ సేల్ ప్రారంభమైన తర్వాత మరిన్ని డీల్స్ వెల్లడి కానున్నాయి.