Independence Day 2025 : ఈసారి ఎర్రకోటలో ఇండిపెండెన్స్ డే వేడుకలకు వెళ్లాలని ఉందా? ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫుల్ ప్రాసెస్..!
Independence Day 2025 : ఈసారి ఎర్రకోటలో ఇండిపెండెన్స్ డే వేడుకులను జరుపుకోండి. ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.

Independence Day 2025
Independence Day 2025 : ప్రతి ఏడాది దేశీయ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటాం. ఈసారి దేశీయ 79వ స్వాతంత్య్ర దినోత్సవం 2025 ఆగస్టు 15 (శుక్రవారం) జరుపుకోబోతున్నాం. దేశంలోని ప్రతి మూలలో ఈ స్వాత్రంత్య వేడుకలను (Independence Day 2025) నిర్వహిస్తారు. అయితే, ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో మాత్రం ప్రతి ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యాంతం ఆకట్టుకునేలా ఉంటుంది.
ఈ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పౌరులను ఆకర్షించే ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుకకు స్వయంగా మీరు కూడా హాజరు కావాలని అనుకుంటున్నారా? అయితే, ఇప్పుడే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్ ఆప్షన్ల ద్వారా సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ :
ఆన్‌లైన్ రిజర్వేషన్‌లు ఆగస్టు 13న రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక పోర్టల్‌లు aamantran.mod.gov.in, e-invitations.mod.gov.in ద్వారా అందుబాటులో ఉంటాయి.
బుకింగ్ ప్రాసెస్ ఇలా :
- అధికారిక వెబ్‌సైట్‌లలో ఏదైనా విజిట్ చేసి టికెట్ బుకింగ్ చేయొచ్చు.
- ‘Independence Day 2025 Ticket Booking’ ఆప్షన్ ఎంచుకోండి.
- మీ పేరు, మొబైల్ నంబర్, ఎన్ని టిక్కెట్లు కావాలో ఎంటర్ చేయండి.
- మీ ఆధార్, ఓటరు ఐడీ లేదా పాస్‌పోర్ట్ వంటి వ్యాలీడ్ అయ్యే ID ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి.
మీ టికెట్ కేటగిరీని ఇలా ఎంచుకోండి :
- రూ. 20 (జనరల్), రూ.100 (స్టాండర్డ్) లేదా రూ. 500 (ప్రీమియం).
- డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా UPI ద్వారా పేమెంట్ చేయండి.
- QR కోడ్, సీటింగ్ సమాచారంతో ఇ-టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఎంట్రీ గేట్ వద్ద డిజిటల్ కాపీ లేదా ప్రింటవుట్ చూపించాల్సి ఉంటుంది.
ఆఫ్‌లైన్ టికెట్ బుకింగ్ :
ఆగస్టు 10 నుంచి 12 వరకు ఢిల్లీలోని ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యాలయాలు, ప్రత్యేక కౌంటర్లలో నేరుగా టిక్కెట్లు తీసుకోవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు వ్యాలీడ్ ఫొటో ఐడీని కలిగి ఉండాలి. క్యాష్ పేమెంట్లు లేదా డిజిటల్‌గా చేయవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్‌ల మాదిరిగానే ధరలు ఉంటాయి. టిక్కెట్లు లిమిటెడ్‌గా ఉన్నాయి. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసుకోండి.
Read Also : Oppo K13 Turbo series: ఓ రేంజ్‌లో ఉన్నాయిగా.. ఒప్పో నుంచి భారత్‌లో 2 స్మార్ట్‌ఫోన్లు విడుదల..
ఈవెంట్ డే మార్గదర్శకాలివే :
- స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
- ఉదయం 6:30 నుంచి 7:00 గంటల మధ్య ఎంట్రీ ఉంటుంది.
- ఢిల్లీ మెట్రో సర్వీసులు ఉదయం 4:00 గంటలకు ప్రారంభమవుతాయి.
- మెట్రో స్టేషన్లు లాల్ ఖిలా (వైలెట్ లైన్), చాందినీ చౌక్ (ఎల్లో లైన్) వేదికకు దగ్గరగా ఉంటాయి.
సెక్యూరిటీ చెకింగ్ కోసం సందర్శకులు తమ టికెట్, ఒరిజినల్ ఐడీని తీసుకెళ్లాలి. భద్రతా ఏర్పాట్ల కారణంగా హాజరైనవారు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని అధికారిక సూచనలను పాటించాలని అధికారులు కోరారు.