Oppo K13 Turbo series: ఓ రేంజ్‌లో ఉన్నాయిగా.. ఒప్పో నుంచి భారత్‌లో 2 స్మార్ట్‌ఫోన్లు విడుదల..
రెండు మోడళ్ల ప్రీ-బుకింగ్ ఆగస్టు 11న ప్రారంభమైంది. కె13 టర్బో ప్రో 5జీ ఆగస్టు 15 నుంచి, కె13 టర్బో 5జీ ఆగస్టు 18 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్, రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి.

ఒప్పో నుంచి భారత్‌లో మరో స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదలైంది. రెండు వేరియంట్లలో ఒప్పో కె13 టర్బో సిరీస్ ఇవాళ లాంచ్ అయింది. ఒప్పో కె13 టర్బో, ఒప్పో కె13 టర్బో ప్రో మోడళ్లలో ఇంటర్నల్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్లతో పనిచేసే యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది.
ఒప్పో కె13 టర్బో సిరీస్ ధర
ఒప్పో కె13 టర్బో ప్రో ధర 8జీబీ + 256జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌కు రూ.37,999. అదే స్టోరేజ్‌తో 12జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 39,999గా ఉండవచ్చు.
ఒప్పో కె13 టర్బో ధర 128జీబీ స్టోరేజ్‌తో 8జీబీ ర్యామ్ వేరియంట్‌కు రూ.27,999, 256జీబీ స్టోరేజ్‌తో 8జీబీ ర్యామ్ వేరియంట్‌కు రూ. 29,999.
ఫీచర్లు
ఒప్పో కె13 టర్బో సిరీస్‌లో 6.80-అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1,600 నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటాయి.
కె13 టర్బో ప్రో వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్, 16జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ యూఎఫ్‌ఎస్ 4.0 స్టోరేజ్ వరకు ఉంటుంది.
కె13 టర్బోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్, 16జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్ వరకు ఉంటుంది. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ ఓఎస్ 15తో వస్తాయి.
కెమెరా విషయానికి వస్తే, ఒప్పో కె13లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2-మెగాపిక్సెల్ రెండవ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. రెండు మోడళ్లలోనూ సెల్ఫీలు, వీడియో చాట్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఒప్పో కె13 టర్బో, కె13 టర్బో ప్రోలో 7,000ఎంఏహెచ్ బ్యాటరీలు, 80వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి ఉంటాయి.
కె13 టర్బో ప్రో 5జీ సిల్వర్ నైట్, పర్పుల్ ఫాంటమ్, మిడ్‌నైట్ మావరిక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కె13 టర్బో 5జీ టర్బో ల్యూమినస్ రింగ్ డిజైన్‌తో వైట్ నైట్, పర్పుల్ ఫాంటమ్, మిడ్‌నైట్ మావరిక్ రంగుల్లో వస్తుంది.
రెండు మోడళ్ల ప్రీ-బుకింగ్ ఆగస్టు 11న ప్రారంభమైంది. కె13 టర్బో ప్రో 5జీ ఆగస్టు 15 నుంచి, కె13 టర్బో 5జీ ఆగస్టు 18 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్, రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి.