JioFiber Postpaid Plans : రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త జియోఫైబర్ కనెక్షన్ కోసం చూస్తున్నారా? అయితే జియో యూజర్లందరికి కంపెనీ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. జియో యూజర్లు జీరో కాస్ట్ బుకింగ్‌లో కొత్త JioFiber కనెక్షన్‌ని పొందవచ్చు. అయితే ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో బ్రాడ్‌బ్యాండ్ రూటర్ ఇన్స్టాలేషన్, డిపాజిట్ చేసేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అదనంగా, కొత్త కస్టమర్లు మూడు, ఆరు లేదా పన్నెండు నెలల పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను పొందవచ్చు. అందులో TV, 400+ ఛానెల్స్, యాడ్ చేసిన OTT (ఓవర్-ది-టాప్) బెనిఫిట్స్ కూడా ఎంచుకోవచ్చు.
Jio పోస్ట్‌పెయిడ్ JioFiber ప్లాన్లపై స్పెషల్ బెనిఫిట్స్ అందిస్తోంది. రూ. 499, రూ. 599, రూ. 799, రూ. 899 వంటి జియో ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త JioFiber పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఏదైనా ఒకటి ఎంచుకునే కస్టమర్లు ఫ్రీ ఇన్స్టాలేషన్, గేట్‌వే రూటర్, సెట్-టాప్ కూడా పొందవచ్చు.
జియో ఫైబర్ బాక్స్‌తో పాటు రూ. 10వేల కన్నా ఎక్కువ విలువైన ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఉచిత ఇన్స్టాలేషన్, జీరో సెక్యూరిటీ డిపాజిట్‌తో JioFiber పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ JioFiber పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వివరంగా ఓసారి పరిశీలిద్దాం.
రూ. 499 ప్లాన్ :
JioFiber పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 30Mbps స్పీడ్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 400+ ఛానెల్‌లతో డిమాండ్ టీవీ, Eros Now, Universal Plus, మరిన్నింటితో సహా OTT యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.
రూ. 599 ప్లాన్ :
ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 30Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ‘On Demand TV’లో 550 ప్లస్ ఛానెల్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, మరో 12 వంటి OTT యాప్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా ఉన్నాయి.
రూ. 799 ప్లాన్ :
ఈ JioFiber పోస్ట్‌పెయిడ్ బండిల్లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100Mbps ఇంటర్నెట్ ఉన్నాయి. ఈ ప్లాన్ Eros Now, Universal Plus, 4 ఇతర OTT ఛానెల్‌ల వంటి OTT యాప్‌లకు ఫ్రీగా మెంబర్షిప్ కూడా అందిస్తుంది. అలాగే 400 కన్నా ఎక్కువ ఛానెల్‌లతో ఆన్-డిమాండ్ టీవీ కూడా ఉంది.
రూ. 899 ప్లాన్ :
ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, 100Mbps ఇంటర్నెట్ను అందిస్తుంది. 550+ ఆన్ డిమాండ్ టీవీ ఛానెల్స్, Disney Plus Hotstar, Sony Liv, 12 మరిన్నింటికి ఫ్రీగా OTT యాప్ సబ్స్క్రిప్షన్లను కూడా అందిస్తుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..