×
Ad

JioHotstar : జియో హాట్‌స్టార్‌ బంపర్ ఆఫర్.. ఇకపై నెలకు జస్ట్ రూ. 79 చెల్లిస్తే చాలు.. మీ ఫేవరెట్ మూవీలను యాడ్స్ లేకుండా చూడొచ్చు!

JioHotstar Plan : జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్ యూజర్లందరి కోసం నెలవారీ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ల ధరలు రూ. 79 నుంచి అందుబాటులో ఉన్నాయి. పూర్తి ప్లాన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.

JioHotstar Plan (Image Credit To Original Source)

  • జియోహాట్‌స్టార్ నెలవారీ ప్రారంభ ప్లాన్ రూ. 80 కన్నా తక్కువ ధరకే
  • సింగిల్ మొబైల్ డివైజ్, మల్టీ స్క్రీన్లలో కంటెంట్‌ కోసం ప్లాన్‌ ఎంచుకోవచ్చు
  • హాలీవుడ్ కంటెంట్, హై క్వాలిటీ స్ట్రీమింగ్ హై ప్లాన్‌లలో యాడ్-ఆన్‌లు
  • ఈ కంటెంట్ కోసం జియోహాట్ స్టార్ కస్టమర్లు అదనంగా చెల్లించక్కర్లేదు

JioHotstar Plan : జియోహాట్‌స్టార్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఈ ప్లాట్‌ఫామ్ ఫస్ట్ టైమ్ నెలవారీ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు నెలకు ప్లాన్ల ధరలు కేవలం రూ. 79 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్ మొబైల్ యూజర్లకు మాత్రమే కాదు.. సూపర్, ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు కూడా వర్తిస్తుంది.

చాలా మంది వినియోగదారులు మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల మధ్య ప్లాన్లను ఎంచుకుంటున్నారు. కొత్త ప్లాన్‌లు జనవరి 28 నుంచి కొత్త యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆటో-రెన్యువల్ యాక్టివ్‌గా ఉన్నంత వరకు ప్రస్తుత యూజర్లు తమ కరెంట్ ప్లాన్‌లతో కొనసాగవచ్చు.

నెలకు రూ.79 నుంచే మొబైల్ ప్లాన్లు ప్రారంభం :
జియో హాట్‌స్టార్ నుంచి లభించే అత్యంత చౌకైన మొబైల్ ప్లాన్. ధర నెలకు రూ. 79 మాత్రమే. ఈ ప్లాన్‌లో యూజర్లు తమకు ఇష్టమైన షోలను ఒకే మొబైల్ డివైజ్‌లో యాక్సస్ చేయొచ్చు. అయితే, ఈ ప్లాన్ స్ట్రీమింగ్ సమయంలో HD క్వాలిటీతో పాటు యాడ్స్ కూడా కనిపిస్తాయి.

లాంగ్ టైమ్ డేటా ప్లాన్‌ కావాలంటే మొబైల్ డేటా ప్లాన్‌ కూడా తీసుకోవచ్చు. ఈ మొబైల్ డేటా ప్లాన్ ధర 3 నెలలకు రూ.149, ఒక ఏడాదికి రూ.499 నుంచి అందుబాటులో ఉంది. మొబైల్‌లలో కంటెంట్‌ను చూసే యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్. కానీ, హాలీవుడ్ కంటెంట్ ప్రైమరీ మొబైల్ ప్లాన్‌లో కూడా చూడలేరు.

మొబైల్ యూజర్ల కోసం హాలీవుడ్ కంటెంట్ :
హాలీవుడ్ మూవీలు, షోలను చూడాలనుకునే మొబైల్ యూజర్ల కోసం జియోహాట్‌స్టార్ స్పెషల్ ఆప్షన్ కూడా అందిస్తోంది. ఈ యాడ్-ఆన్‌ను మొబైల్ ప్లాన్‌తో పాటు కొనుగోలు చేయవచ్చు. హాలీవుడ్ యాడ్-ఆన్ నెలకు రూ.49, 3 నెలలకు రూ.129, ఏడాదికి రూ.399 ధరకు కూడా అందుబాటులో ఉంది.

Read Also : Realme P4 5G Launch : 10,001mAh టైటాన్ బ్యాటరీతో కొత్త రియల్‌మి 5G ఫోన్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

జియో హాట్‌స్టార్ సూపర్ ప్లాన్ :
మొబైల్ ప్లాన్ కాకుండా నెలకు రూ. 149 ధరతో సూపర్ ప్లాన్‌ కూడా ఎంచుకోవచ్చు. ఒకేసారి రెండు డివైజ్‌లలో స్ట్రీమ్ చేయొచ్చు. ఈ ప్లాన్ మొబైల్ ఫోన్లు, వెబ్ బ్రౌజర్‌లు, స్మార్ట్ టీవీలలో యాక్సస్ చేయొచ్చు.

JioHotstar Plan (Image Credit To Original Source)

ఫుల్ హెచ్‌డీ క్వాలిటీతో కంటెంట్‌ను చూడొచ్చు. అంతేకాదు.. అదనపు ఛార్జీ లేకుండా హాలీవుడ్ మూవీలు, షోలు కూడా చూడొచ్చు. ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో చూసే ఫ్యామిలీ సబ్ స్క్రైబర్లకు అద్భుతమైన ప్లాన్ అని చెప్పొచ్చు.

జియో హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్ :

జియోహాట్‌స్టార్ యూజర్ల కోసం నెలకు రూ. 299 ప్రీమియం ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ యూజర్లకు ఇష్టమైన కంటెంట్‌ ఒకేసారి 4 ఫోన్లలో యాక్సస్ చేయొచ్చు. హై క్వాలిటీతో వీడియో కంటెంట్ సైతం చూడొచ్చు.

లైవ్ స్పోర్ట్స్, లైవ్ షోల సమయంలో మాత్రమే యాడ్‌తో కంటెంట్ చూడొచ్చు. అలాగే, లాంగ్ టైమ్ సబ్ స్క్రిప్షన్లను ఇష్టపడే యూజర్లకు త్రైమాసిక, వార్షిక ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.