Realme P4 5G Launch : 10,001mAh టైటాన్ బ్యాటరీతో కొత్త రియల్‌మి 5G ఫోన్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme P4 5G Launch : రియల్‌మి P4 పవర్ 5G జనవరి 29న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇందులో 10,001mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 1.5K హైపర్‌గ్లో 4D కర్వ్ + డిస్‌ప్లే ఉంటుంది.

Realme P4 5G Launch : 10,001mAh టైటాన్ బ్యాటరీతో కొత్త రియల్‌మి 5G ఫోన్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme P4 5G Launch (Image Credit To Original Source)

Updated On : January 20, 2026 / 3:08 PM IST
  • జనవరి 29నే రియల్‌మి P4 పవర్ 5G లాంచ్
  • అతిపెద్ద 10,001mAh టైటాన్ బ్యాటరీతో పవర్‌ఫుల్ ఫోన్
  • 1.5K హైపర్‌గ్లో 4D కర్వ్+ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్
  • ధర రూ. 35వేల నుంచి రూ. 40వేల మధ్య ఉండవచ్చు

Realme P4 5G Launch : రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి మరో కొత్త ఫోన్ లాంచ్ తేదీని ధృవీకరించింది. అదే.. రియల్‌మి P4 పవర్ 5G ఫోన్. అతి త్వరలో భారత మార్కెట్లో రియల్‌మి P4 5G లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది.

రియల్‌మి P4 సిరీస్‌లోని ఈ పవర్‌ఫుల్ 5G ఫోన్ భారీ 10,001mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు ఇటీవలే లీక్ అయ్యాయి. ఈ రియల్‌మి ఫోన్ ధర రూ. 35వేల నుంచి రూ. 40వేల మధ్య ఉండవచ్చునని చెబుతున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 1.5K రిజల్యూషన్ హైపర్‌గ్లో 4D కర్వ్ ప్లస్ డిస్‌ప్లేతో రానుంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.

రియల్‌మి P4 పవర్ 5G లాంచ్ తేదీ :
జనవరి 29న లోకల్ టైమ్ మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ రియల్‌మి P4 పవర్ 5Gని లాంచ్ చేయనుంది.

Realme P4 5G Launch

Realme P4 5G Launch  (Image Credit To Original Source)

రియల్‌మి P4 పవర్ 5G స్పెసిఫికేషన్లు :
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ రియల్‌మి 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ గేమింగ్ మల్టీమీడియా కోసం అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుందని అంచనా.

Read Also : Samsung Galaxy S25 Ultra : అమెజాన్ ఆఫర్ అదిరింది బ్రో.. ఈ శాంసంగ్ S25 అల్ట్రా ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!

ఇమేజింగ్ పర్ఫార్మెన్స్ కూడా మెరుగుపరుస్తుంది. డెడికేటెడ్ హైపర్‌విజన్+ ఏఐ చిప్‌ కూడా అందిస్తుందని భావిస్తున్నారు. రియల్‌మి P4 పవర్ 5జీ ఫోన్ అతిపెద్ద బ్యాటరీతో వస్తుంది. ఏకంగా ఈ బ్యాటరీ 10,001mAh కెపాసిటీతో వస్తుంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ బరువు సుమారు 219 గ్రాములు ఉంటుందని అంచనా.

రియల్‌మి P4 పవర్ 5జీ కెమెరా, స్పెసిఫికేషన్లు :
కెమెరాల విషయానికొస్తే.. ఈ రియల్‌మి ఫోన్ ట్రిపుల్ రియర్ సెటప్‌‌తో వస్తుంది. ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP సెన్సార్‌గా ఉంటుంది. ఈ ఫోన్‌లో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ థర్డ్ అసిస్టెన్స్ సెన్సార్ కూడా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ ఈ రియల్‌మి 16MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.