JioPhone Prima 2 : కర్వ్డ్ స్క్రీన్, ఫ్రంట్ కెమెరాతో జియోఫోన్ ప్రైమా 2 ఫీచర్ ఫోన్.. ధర, ఫీచర్లు వివరాలివే!

JioPhone Prima 2 Launch : భారత మార్కెట్లో జియోఫోన్ ప్రైమా 2 లాంచ్ చేసింది. జియోఫోన్ ప్రైమా 4జీకి అప్‌గ్రేడ్ వెర్షన్ జియో నుంచి వచ్చిన ఫీచర్ ఫోన్ వచ్చేసింది.

JioPhone Prima 2 Feature Phone With 2.4-Inch Curved Screen

JioPhone Prima 2 Launch : కొత్త ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో జియోఫోన్ ప్రైమా 2 లాంచ్ చేసింది. నవంబర్ 2023లో దేశంలో ప్రవేశపెట్టిన జియోఫోన్ ప్రైమా 4జీకి అప్‌గ్రేడ్ వెర్షన్ జియో నుంచి వచ్చిన ఫీచర్ ఫోన్.

Read Also : Huawei Mate XT : ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్.. హువావే మేట్ XT మడతబెట్టే ఫోన్.. ధర ఎంతో తెలుసా?

రెండో జనరేషన్ జియోఫోన్ ప్రైమా గత హ్యాండ్‌సెట్‌లోని కొన్ని ముఖ్య ఫీచర్లను కలిగి ఉంది. కానీ, కొన్ని అప్‌గ్రేడ్స్ కూడా పొందింది. జియోఫోన్ ప్రైమా 2 క్వాల్‌కామ్ చిప్‌సెట్, 2,000mAh బ్యాటరీ, 2.4-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌తో అమర్చి ఉంది. బ్యాక్, ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటుంది.

భారత్‌లో జియోఫోన్ ప్రైమా 2 ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో జియోఫోన్ ప్రైమా 2 ధర రూ. 2,799, సింగిల్ టెక్స్ట్ లక్స్ బ్లూ షేడ్‌లో అందిస్తుంది. ఈ ఫోన్ దేశంలో అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

జియోఫోన్ ప్రైమా 2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
జియోఫోన్ ప్రైమా 2 2.4-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్, కీప్యాడ్‌ని కలిగి ఉంది. జియోఫోన్ పేర్కొని క్వాల్‌కామ్ చిప్‌సెట్, కియాఓఎస్ 2.5.3పై రన్ అవుతుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 4జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, 128జీబీ విస్తరించిన మెమరీకి సపోర్టు ఇస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. జియోఫోన్ ప్రైమా 2 ఫ్రంట్ కెమెరా యూనిట్‌తో పాటు బ్యాక్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. బాహ్య వీడియో చాట్ అప్లికేషన్‌ను ఉపయోగించకుండా నేరుగా వీడియో కాలింగ్‌కు ఫోన్ సపోర్టు ఇస్తుందని వస్తుంది. ఎల్ఈడీ టార్చ్ యూనిట్‌తో అమర్చి ఉంటుంది. జియో నుంచి వచ్చిన లేటెస్ట్ ఫీచర్ ఫోన్ జియోపేకు సపోర్టు ఇస్తుంది.

జియో యూజర్లు యూపీఐ పేమెంట్లను స్కాన్ చేసేందుకు అనుమతిస్తుంది. ఎంటర్‌టైన్మెంట్ కోసం జియోటీవీ, జియోసినిమా, జియోసావన్ వంటి యాప్‌లతో వస్తుంది. వినియోగదారులు ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ వంటి కమ్యూనికేషన్, సోషల్ మీడియా టూల్స్ యాక్సెస్ చేయవచ్చు. ఈ జియోఫోన్ 23 భాషలకు కూడా సపోర్టుతో వస్తుంది.

జియోఫోన్ ప్రైమా 2 ఫోన్ 2,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ సింగిల్ నానో-సిమ్ ద్వారా 4జీ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు జియోఫోన్ ద్వారా ఎఫ్ఎమ్ రేడియోను యాక్సెస్ చేయవచ్చు. 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌ను కూడా పొందవచ్చు. లెదర్-వంటి ఎండ్ కలిగి ఉంది. ఫోన్ సైజు ‎123.4 x 55.5 x 15.1ఎమ్ఎమ్, 120గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Apple iPhone 16 : మీ ఫోన్లు మడతపెట్టినప్పుడు చెప్పండి.. ఆపిల్ ఐఫోన్ 16పై శాంసంగ్ వ్యంగ్యాస్త్రాలు..!

ట్రెండింగ్ వార్తలు