Jio OTT Broadband Plan
Jio OTT Broadband Plan : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. భారత అతిపెద్ద టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో అదిరిపోయే (Jio OTT Broadband Plan) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో తమ వినియోగదారుల కోసం నెలకు కేవలం రూ.599 (టాక్సులతో) ధరకే అత్యంత విలువైన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తోంది.
జియో బేస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ.399 నుంచి అందుబాటులో ఉంది. రూ.599 ప్లాన్ ద్వారా అనేక OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 599 ప్లాన్ : స్పీడ్, స్ట్రీమింగ్ బెనిఫిట్స్ :
కొంతమంది వినియోగదారులకు ఈ ప్లాన్ ప్రస్తుత ప్రైమరీ ప్లాన్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ధర రూ.399 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ప్లాన్‌లోని అదనపు రూ.200 వైడ్ రేంజ్ కంటెంట్‌కు యాక్సెస్ పొందవచ్చునని జియో పేర్కొంది.
ఫ్రీ OTT సబ్‌స్క్రిప్షన్లు :
ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో 12+ OTT ప్లాట్‌ఫామ్‌లకు ఫ్రీగా యాక్సెస్ పొందవచ్చు.
ఆసక్తిగల కస్టమర్ల కోసం లైవ్ స్ట్రీమింగ్ టీవీ ఛానెల్స్ పొందవచ్చు. ఫుల్‌ఎంటర్ టైన్మెంట్ ప్యాకేజీగా వస్తుంది. కానీ, పైన పేర్కొన్న OTT సర్వీసులు కస్టమర్‌లు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా వినియోగించుకోవచ్చు.
బ్రాడ్‌బ్యాండ్‌కు ఇంటర్నెట్ స్పీడ్ కావాలా? :
మీరు 100Mbps ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. స్పీడ్ ఇంటర్నెట్ డేటా అవసరమయ్యే యూజర్ల కోసం జియో 100Mbps స్పీడ్ అందించే రూ. 899 రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది. అదే OTT బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లు 6 నెలలు లేదా 12 నెలల లాంగ్ వ్యాలిడిటీ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జియో కొత్త కస్టమర్లకు కూడా ఫ్రీ జియోహోమ్ ట్రయల్‌ను అందిస్తోంది.