UAN Number : మీ PF అకౌంట్ UAN నెంబర్ మర్చిపోయారా? జస్ట్ ఒక క్లిక్‌తో ఇలా తెలుసుకోవచ్చు.. ఈ 5 మార్గాల్లో ట్రై చేయండి..!

UAN Number : పీఎఫ్ అకౌంట్‌కు సంబంధించిన UAN నెంబర్ గుర్తులేదా? ఈ 5 మార్గాల్లో సింపుల్‌గా UAN నెంబర్ తెలుసుకోవచ్చు..

UAN Number : మీ PF అకౌంట్ UAN నెంబర్ మర్చిపోయారా? జస్ట్ ఒక క్లిక్‌తో ఇలా తెలుసుకోవచ్చు.. ఈ 5 మార్గాల్లో ట్రై చేయండి..!

UAN Number

Updated On : July 17, 2025 / 10:40 PM IST

UAN Number : ప్రతి ఉద్యోగికీ UAN నంబర్ చాలా ముఖ్యం. ఈ UAN నంబర్ ద్వారా PF అకౌంటుకు సంబంధించిన అనేక సర్వీసులను పొందవచ్చు. గతంలో కన్నా ఇప్పుడు UAN తెలుసుకోవడం చాలా సులభం. UAN నెంబర్ తెలుసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి..

ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ఏదైనా సంస్థలో పనిచేసే ఉద్యోగులకు UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ముఖ్యమైన గుర్తింపు నెంబర్. ఈ 12 అంకెల ప్రత్యేక సంఖ్య EPFO ద్వారా జారీ అవుతుంది. తద్వారా PF బ్యాలెన్స్, పాస్‌బుక్, ట్రాన్స్‌ఫర్, క్లెయిమ్ వంటి అన్ని ఆన్‌లైన్ సర్వీసులను సులభంగా పొందవచ్చు.

చాలా సార్లు ఉద్యోగులు తమ UAN నంబర్‌ను మరచిపోతుంటారు. ఇలాంటి పరిస్థితిలో, ఇప్పుడు UAN నెంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఏయే మార్గాల్లో ఈ నెంబర్ తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. EPFO వెబ్‌సైట్ నుంచి UAN నెంబర్ తెలుసుకోవచ్చు :

  • ముందుగా EPFO వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  • ‘Services’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ‘For Employees’ ఎంచుకోండి.
  • ‘Member UAN/Online Services’ ఆప్షన్‌కు వెళ్లండి.
  • అక్కడే ‘Know Your UAN’ పై క్లిక్ చేయండి.
  • అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
  • శాలరీ స్లిప్ ప్రకారం.. మెంబర్స్ ఐడీ, ఆధార్ లేదా పాన్, పుట్టిన తేదీ, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • మీరు ఈ వివరాలను సమర్పించిన తర్వాత మీ మొబైల్‌కు OTP వస్తుంది. అది ఎంటర్ చేయండి.
  • మీ UAN నంబర్ మీ మొబైల్‌కు SMS ద్వారా వస్తుంది.

2. SMS ద్వారా UAN నంబర్ తెలుసుకోండి :

  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి SMS ఇలా పంపండి.
  • ఇలా టైప్ చేయాలి : EPFOHO UAN ENG
  • ఈ మెసేజ్ 7738299899కు పంపండి.
  • కొన్ని సెకన్లలో మీ UAN, PF బ్యాలెన్స్, ఇతర వివరాలతో SMS అందుతుంది.

ఇతర లాంగ్వేజీల్లో.. :
‘ENG’కి బదులుగా, HIN (హిందీ), TEL (తెలుగు) మొదలైన మీ లాంగ్వేజీ కోడ్‌ను ఎంటర్ చేయండి.

3. ఉమాంగ్ మొబైల్ యాప్ వాడండి :

  • ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని EPFO సర్వీసులకు వెళ్లండి.
  • ‘మీ Know Your UAN’ ఆప్షన్ ఎంచుకోండి.
  • మొబైల్ నంబర్, ఇతర అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
  • OTP ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
  • మీ UAN నంబర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

4. మిస్డ్ కాల్ సర్వీస్ ద్వారా UAN తెలుసుకోండి :
EPFOలో రిజిస్టర్ అయి మీ మొబైల్ నంబర్ నుంచి 012901406కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
కాల్ ఆటోమాటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. UANతో సహా మొత్తం సమాచారం మీ నంబర్‌కు SMS ద్వారా వస్తుంది.

Read Also : SIP Returns : SIPలో నెలకు రూ. 6వేలు పెట్టబడి పెడితే.. రిటైర్ అయ్యాక నెలకు రూ. లక్ష చేతికి వస్తుంది.. ఎలాగంటే?

5. HR డిపార్ట్‌మెంట్ నుంచి శాలరీ స్లిప్ :
చాలా కంపెనీలు ప్రతి నెలా శాలరీ స్లిప్‌లో UAN నంబర్‌ను కూడా అందిస్తాయి.
మీకు తెలియకపోతే.. మీ HR లేదా పేరోల్ డిపార్ట్ మెంట్ నుంచి UAN నెంబర్ అడిగి తెలుసుకోవచ్చు.

UAN నంబర్ మారుతుందా? :

  • మీ జాబ్ కెరీర్ మొత్తం UAN నంబర్ మారదు. కొత్త ఉద్యోగం వచ్చాక కొత్త PF అకౌంట్ క్రియేట్ అవుతుంది. కానీ, UAN నెంబర్ అలాగే ఉంటుంది.
  • మీరు పొరపాటున రెండు UAN నెంబర్లను పొందినట్లయితే.. నిని EPFO నుంచి వెంటనే మెర్జ్ విలీనం చేసుకోండి.
  • మీరు UAN పొందాక ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంటుతో లింక్ చేయాలి.
  • ఆన్‌లైన్ క్లెయిమ్, బ్యాలెన్స్ చెక్ లేదా KYC వంటి సర్వీసులకు ఇబ్బంది ఉండదు.
  • మీకు OTP లేదా ఇతర సమాచారం అందకపోతే.. మీ మొబైల్ నంబర్, ఆధార్ వివరాలను EPFO లేదా HRతో అప్‌డేట్ చేయించుకోండి.