Social Media Ban : 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్? సంచలనం దిశగా..!

Social Media Ban : టీనేజర్లు సోషల్ మీడియా వినియోగంపై కొత్త చట్టం అమల్లోకి రానుంది. 16 ఏళ్లలోపు టీనేజర్లను సోషల్ మీడియా నుంచి నిషేధించనుంది.

Social Media Ban

Social Media Ban : అతి త్వరలో సోషల్ మీడియా వినియోగంపై కొత్త చట్టం రాబోతుంది. ప్రత్యేకించి 16ఏళ్ల లోపు టీనేజర్లు సోషల్ మీడియా యాక్సస్ చేయలేరు. వయస్సు ఆధారంగా సోషల్ మీడియా (Social Media Ban) అకౌంట్లను వినియోగించాల్సి ఉంటుంది.

ఆస్ట్రేలియాలో వయస్సును ధృవీకరించే సాంకేతికతతో ఈ కొత్త నిషేధ చట్టం అమల్లోకి రానుంది. తద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా అవతరించనుంది.

Read Also : Apple M4 MacBook Air : కొత్త ఆపిల్ ల్యాప్‌టాప్ ఇదిగో.. అతి తక్కువ ధరకే M4 మ్యాక్‌బుక్ ఎయిర్.. ఇలా కొనేసుకోండి..!

పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఇటీవల ఒక ఏజ్ అస్యూరెన్స్ టెక్నాలజీ ట్రయల్ నిర్వహించింది. ఇందులో వెయ్యికి పైగా స్కూల్ విద్యార్థులు, వందలాది మంది పెద్దలు పాల్గొన్నారు. వ్యక్తిగత డేటా సేకరించకుండా ప్రస్తుత టూల్స్ ద్వారా యూజర్ల వయస్సును ఎంతవరకు ధృవీకరించవచ్చో ట్రయల్ పరీక్షించింది.

ఈ ట్రయల్ యూకే-ఆధారిత ఏజ్ చెక్ సర్టిఫికేషన్ స్కీమ్ (ACCS) పర్యవేక్షించింది. ఫలితంగా ఆస్ట్రేలియా ప్రతిపాదిత చట్టం పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదేగాని జరిగితే.. ఆస్ట్రేలియా 2025 చివరి నాటికి 16 ఏళ్లలోపు టీనేజర్లను సోషల్ మీడియా నుంచి నిషేధించనుంది.

ఇదేలా పనిచేస్తుందంటే? :
వయస్సు ధృవీకరణ మోడల్ సెక్యూరిటీ లేయర్ కలిగి ఉంటుంది. పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లను ఉపయోగించి ట్రెడేషనల్ ID-ఆధారిత వెరిఫికేషన్ ఉంటుంది.

స్వతంత్ర వ్యవస్థల ద్వారా ధృవీకరిస్తాయి. అయితే, ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఎప్పుడూ వ్యక్తిగత డాక్యుమెంట్లను నేరుగా యాక్సెస్ చేయవు. ఇందులో మరో సెక్యూరిటీ లేయర్ బయోమెట్రిక్ కూడా ఉంటుంది. యూజర్ల వయస్సును ధృవీకరించేందుకు ఏఐతో సెల్ఫీ లేదా షార్ట్ వీడియోను అప్‌లోడ్ చేయవచ్చు.

ఈ విధానం చాలా వేగంగా ఉంటుంది. బయోమెట్రిక్ డేటాను స్టోర్ చేయదు. థర్ట్ పార్టీ యాక్సస్ పరిమితంగానే ఉంటుంది. యూజర్ల వయస్సును పూర్తి స్థాయిలో అంచనా వేయొచ్చు.

ఇమెయిల్ టైప్, లాంగ్వేజీ, డిజిటల్ వంటి ప్యాట్రన్స్ ద్వారా అంచనా వేస్తుంది. ఈ కొత్త టెక్నాలజీతో టీనేజర్ల ప్రైవసీకి తగినట్టుగా వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.

డిసెంబర్‌లోగా బ్యాన్ అమలు చేయాలి Social Media Ban :
డిసెంబర్ 2025 నుంచి ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్పాప్‌చాట్, X వంటి సోషల్ ప్లాట్‌ఫారమ్‌లను 16ఏళ్ల లోపు టీనేజర్లకు యాక్సస్ ఉండకూడదు. అలా లేని పక్షంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయా ప్లాట్ ఫారాలపై కఠిన చర్యలు తీసుకుంటుంది.

ప్రతి ఉల్లంఘనకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (అంటే దాదాపు 32 మిలియన్ డాలర్లు ) వరకు జరిమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. యూట్యూబ్, వాట్సాప్, గూగుల్ క్లాస్‌రూమ్‌తో సహా కొన్ని ప్లాట్‌ఫామ్‌లకు ప్రస్తుతానికి మినహాయింపు ఉంటుంది.

ఆస్ట్రేలియా సోషల్ మీడియా కొత్త చట్టంపై యూకే, న్యూజిలాండ్, ఈయూ సభ్యదేశాలు సహా ఇతర దేశాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.

పిల్లల సోషల్ మీడియా యాక్సెస్‌ను నియంత్రించే మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రైవసీతో పాటు పిల్లలకు రక్షణ కల్పించే దిశగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఈ ట్రయల్‌ను నిర్వహించింది.

Read Also : BSNL Q 5G Plan : BSNL కొత్త Q-5G సర్వీసు.. సిమ్ లేకుండానే హై స్పీడ్ ఇంటర్నెట్.. కేవలం రూ. 999 నుంచే ప్లాన్..!

ఈ ట్రయల్ ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వయస్సు ధృవీకరణ సాధ్యం కాకపోవచ్చు.. ఎందుకంటే.. పిల్లలు VPN, షేర్డ్ డివైజ్‌లు లేదా ఇతరుల క్రెడిన్షియల్స్ ఉపయోగించి సోషల్ మీడియా అకౌంట్లను యాక్సస్ చేసే వీలుంది.