Lava Blaze 3 5G With 90Hz Display, MediaTek Dimensity 6300 SoC Launched
Lava Blaze 3 5G Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా బ్లేజ్ 3 5జీ భారత మార్కెట్లో లాంచ్ అయింది. గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయిన లావా బ్లేజ్ 2 5జీకి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. కంపెనీ లేటెస్ట్ బడ్జెట్ ఆఫర్‌లో 90Hz డిస్‌ప్లే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లతో కూడిన మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ వంటి స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. లావా బ్లేజ్ 3 5జీలో “వైబ్ లైట్” కూడా ఉంది. ఫొటోగ్రఫీలో లైటింగ్‌ను మెరుగుపర్చే సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ కూడా ఉంది. దీని సాయంతో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.
Read Also : Jio SIM Card : జియో కొత్త సిమ్ కావాలా? మీ ఇంట్లో నుంచే యాక్టివేట్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..!
భారత్‌లో లావా బ్లేజ్ 3 5జీ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో లావా బ్లేజ్ 3 5జీ ప్రారంభ ధర రూ. 11,499కు అందిస్తోంది. అయితే.. ప్రత్యేక లాంచ్ ధరగా కంపెనీ చెబుతోంది. బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ ధరను రూ. 9,999కు అందిస్తోంది. సింగిల్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 18 నుంచి రాత్రి 12 గంటల నుంచి ప్రత్యేకంగా అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ గ్లాస్ బ్లూ, గ్లాస్ గోల్డ్ అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది.
లావా బ్లేజ్ 3 5జీ స్పెసిఫికేషన్‌లు :
లావా బ్లేజ్ 3 5జీ 720×1,600 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ సాంద్రతతో 6.56-అంగుళాల హెచ్‌డీ+ హోల్-పంచ్ డిస్‌ప్లేతో వస్తుంది. కొలతల పరంగా, ఈ హ్యాండ్‌సెట్ 164.3×76.24×8.6ఎమ్ పరిమాణంలో ఉంటుంది. 201 గ్రాముల బరువు ఉంటుంది. 6జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వచ్చిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. స్టోరేజీని మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు. అయితే, ర్యామ్ 6జీబీ వరకు వర్చువల్‌గా విస్తరించవచ్చు. ఈ డివైజ్ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.
LAVA Blaze 3 5G: Segment First VIBE Light*
Sale Starts 18th Sept, 12 AM only on @amazonIN
Special Launch Price: ₹9,999***Techarc (5G Smartphones Under 15K)
**Incl. of bank offersKnow more: https://t.co/MVVJxYzXQG#Blaze3 5G #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/SCeIQ6ugKu
— Lava Mobiles (@LavaMobile) September 16, 2024
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. :
లావా బ్లేజ్ 3 5జీ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఎఫ్/1.8 ఎపర్చరు, 2ఎంపీ సెకండరీ ఏఐ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సెకనుకు 30 ఫ్రేమ్‌ల (fps) వరకు 2కె రిజల్యూషన్‌లో వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఏఐ ఎమోజి మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ప్రో వీడియో మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, ఏఐ మోడ్ వంటి కెమెరా-సెంట్రిక్ ఫీచర్‌లను అందిస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికొస్తే.. :
ఈ హ్యాండ్‌సెట్‌లో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, 5జీ, డ్యూయల్ 4జీ విఓఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 5, బ్లూటూత్ 5.2కి సపోర్ట్ అందిస్తుంది. గ్లోనాస్ సౌజన్యంతో నావిగేషనల్ సామర్థ్యాలతో వస్తుంది. అదనపు భద్రతకు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్‌ను కూడా పొందుతుంది. లావా బ్లేజ్ 3 5జీ ఫోన్ 18డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.