Triumph Speed Bikes : బజాజ్- ట్రయంఫ్ నుంచి రెండు సరికొత్త బైక్స్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర, మైలేజీ వివరాలివే!
Triumph Speed Bikes Launch : ఈ మోటార్‌సైకిల్‌లో మాన్యువల్ థొరెటల్ బాడీ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్, 43ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్క్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, యూఎస్‌బీ పోర్ట్‌తో కూడిన కొత్త కన్సోల్ ఉన్నాయి.

Triumph Speed T4, Speed 400 MY25 launched in India
Triumph Speed Bikes Launch : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో, ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భాగస్వామ్యంలో రెండు సరికొత్త బైకులను ప్రవేశపెట్టాయి. కొత్త ట్రయంఫ్ స్పీడ్ T4, 2025 ట్రయంఫ్ స్పీడ్ 400 బైకులను లాంచ్ చేసింది. ఈ రెండు బైకుల ధరలు వరుసగా రూ. 2.17 లక్షలు, రూ. 2.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఒకే రకమైన 398సీసీ టీఆర్-సిరీస్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. కానీ, విభిన్న ట్యూన్‌లలో ఉన్నాయి.
Read Also : Asteroid FW13 : పురాతన భారీ గ్రహశకలం గంటకు 35వేల మైళ్ల వేగంతో భూమి వైపుగా దూసుకెళ్తోంది.. నాసా హెచ్చరిక..!
కొత్త ట్రయంఫ్ స్పీడ్ టీ4 బైక్ :
కొత్త స్పీడ్ టీ4 సరికొత్త ట్రయంఫ్ 400సీసీ అడ్వాన్స్‌డ్ క్లాసిక్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఈ బైకులోని ఇంజిన్ 31పీఎస్, 36ఎన్ఎమ్ అందిస్తుంది. తక్కువ గేర్ షిఫ్ట్‌లతో మెరుగైన పర్పార్మెన్స్ అందిస్తుంది. తక్కువ నుంచి మధ్య-స్పీడ్ రైడ్‌బిలిటీకి 3,500 నుంచి 5,500rpm మధ్య హై టార్క్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ఈ మోటార్‌సైకిల్‌లో మాన్యువల్ థొరెటల్ బాడీ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్, 43ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫోర్క్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, యూఎస్‌బీ పోర్ట్‌తో కూడిన కొత్త కన్సోల్ ఉన్నాయి. పెరల్ మెటాలిక్ వైట్, కాక్‌టెయిల్ వైన్ రెడ్, ఫాంటమ్ బ్లాక్ అనే మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
2025 ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ :
2025 ట్రయంఫ్ స్పీడ్ 400 ఇంజిన్ అత్యంత శక్తివంతమైన అవతార్. 40పీఎస్, 37.5ఎన్ఎమ్ వద్ద పొందుతుంది. రైడ్-బై-వైర్ థొరెటల్, స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, టార్క్ అసిస్ట్ క్లచ్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, హై-ప్రొఫైల్ టైర్లు, అడ్జస్టబుల్ లివర్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. రేసింగ్ ఎల్లో, పెరల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, ఫాంటమ్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. భారత మార్కెట్లో ట్రయంఫ్ ఆధునిక క్లాసిక్ కుటుంబంలో బోన్నెవిల్లే, స్పీడ్ ట్విన్, థ్రక్స్టన్ వంటి ప్రీమియం మోడల్‌లు కూడా ఉన్నాయి.
Read Also : Jio SIM Card : జియో కొత్త సిమ్ కావాలా? మీ ఇంట్లో నుంచే యాక్టివేట్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..!