Lava Bold N4 Lite : అద్భుతమైన కెమెరాతో కొత్త లావా బోల్డ్ N4 లైట్ వస్తోందోచ్.. ఫీచర్లపై భారీ అంచనాలివే..
Lava Bold N4 Lite : యూఎస్బీ టైప్-సి పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్‌కు రైట్ సైడ్ మైక్రోఫోన్ కటౌట్ 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ కింద లావా బ్రాండింగ్ కూడా ఉంటుంది. పూర్తి ఫోన్ వివరాలపై ఓసారి లుక్కేయండి.
Lava Bold N4 Lite
- ఆగష్టు 27న భారత మార్కెట్లో లావా బోల్డ్ N4 లైట్ లాంచ్
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో గోల్డ్ కలర్ ఆప్షన్ కూడా ఉండొచ్చు
- లావా బోల్డ్ ఎన్2 లైట్ ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్
Lava Bold N4 Lite : లావా కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. లావా నుంచి వచ్చే వారం కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. లావా బోల్డ్ N4 లైట్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ అయిన లావా బోల్డ్ N2 లైట్ స్థానంలో రానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్ ఉంది. లావా బోల్డ్ N4 లైట్, డ్రాప్ షాక్ ప్రొటెక్షన్ కోసం MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ రేటింగ్ పొందింది. పూర్తి ఆఫర్లు, ధర ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..
ఆగస్టు 27నే లాంచ్ డేట్ :
రాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో మైక్రోసైట్ క్రియేట్ అయింది. లావా బోల్డ్ N4 లైట్ ఆగష్టు 27న భారత మార్కెట్లో (Lava Bold N4 Lite) లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. లావా బోల్డ్ N4 లైట్ కింద ప్రొటెక్షన్ కోసం MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ రేటింగ్ పొందిందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాట్ రియర్ ప్యానెల్ ఉంటుంది.
లావా బోల్డ్ N4 లైట్ బ్యాక్ సైడ్ టాప్ లెఫ్ట్ కార్నర్లో రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్ ఉంటుంది. పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ దిగువన USB టైప్-సి పోర్ట్ ఉంటుంది.
ఛార్జింగ్ పోర్ట్‌కు రైట్ సైడ్ మైక్రోఫోన్ కటౌట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.
Read Also : Apple iPhone 17 : ఆపిల్ ఫోన్ మీ డ్రీమా.. ఈ ఐఫోన్ 17 భారీగా తగ్గిందోచ్.. ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు..!
ఫ్రీ డోర్‌స్టెప్ సర్వీసు :
స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్లో బాటమ్ లెఫ్ట్ కార్నర్ లావా బ్రాండింగ్ ఉంటుంది. ఇతర లావా స్మార్ట్ఫోన్ల మాదిరిగానే లావా బోల్డ్ N4 లైట్ కూడా ఫ్రీ డోర్‌స్టెప్ సర్వీస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లతో మరిన్ని వివరాలు రివీల్ కానున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన లావా బోల్డ్ N2 లైట్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD ప్లస్ నాచ్ డిస్ప్లే (720 × 1600 పిక్సెల్స్) అందిస్తుంది. ఆక్టా-కోర్ UNISOC 9863A ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్ సైడ్ 13MP ఏఐ ప్రైమరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా ఉన్నాయి.
మైక్రో SD కార్డ్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ 512GB వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 గో ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆటో కాల్ రికార్డింగ్, బ్యాటరీ సేవర్ మోడ్, కాన్ఫరెన్స్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, బ్లూటూత్, Wi-Fi, OTG ఉన్నాయి. 5,000mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
