Lava Shark 5G
Lava Shark 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. లావా (Lava Shark 5G) అధికారికంగా లావా షార్క్ 5G ఫోన్ ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ దాదాపు రూ. 8వేలు ఉంటుంది. ప్రీమియం-లుకింగ్ డిజైన్‌తో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లు అందిస్తుంది.
ఈ లావా ఫోన్ పోకో M7 5G, రెడ్‌మి A4 5G, రెడ్‌మి 14Cలతో పోటీ పడనుంది. మే 23 నుంచి కంపెనీ అధికారిక స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటుంది. స్టెల్లార్ గోల్డ్, స్టెల్లార్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లావా షార్క్ 5G ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
భారత్‌లో లావా షార్క్ 5G ధర :
భారత మార్కెట్లో లావా షార్క్ 5G ధర రూ.7,999 రిటైల్ అవుట్‌లెట్‌లు, లావా ఇ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే, ధర ఇప్పటికే సరసమైనది. బ్రాండ్ ఎలాంటి బ్యాంక్ ఆఫర్లను ప్రకటించలేదు.
లావా షార్క్ 5G స్పెసిఫికేషన్లు :
లావా షార్క్ 5G ఫోన్ 90hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ LCD ప్యానెల్‌తో వస్తుంది. 6nm ఫ్యాబ్రికేటెడ్ UNISOC T765 చిప్‌సెట్ పొందుతుంది. 4GB LPDDR4x ర్యామ్ (4GB వర్చువల్ మెమరీని మినహాయింపు) 64GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.
మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు. ఈ లావా ఫోన్ 18W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. బాక్స్‌లో 10W ఛార్జర్‌ను పొందుతారు. లావా షార్క్ 5G ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది.
కెమెరాల విషయానికొస్తే.. ఈ లావా ఫోన్ 13MP కెమెరా, సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ షూటర్‌ను కలిగి ఉంది. SA, NSA 5G బ్యాండ్‌లు, 4G VoLTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, GLONASSతో GPS, USB టైప్-C సపోర్టును అందిస్తుంది.
ఈ లావా ఫోన్ IP54 సర్టిఫికేట్ పొందింది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ను అందిస్తుంది.
డిజైన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ ప్లాస్టిక్‌తో తయారైంది. బ్యాక్ కెమెరా ప్యానెల్ ఐఫోన్ 16 మాదిరి పోలి ఉంటుంది. రైట్ సైడ్ ఫ్లాష్‌తో పాటు కెమెరా బంప్ కూడా ఉంది.