Lava Yuva Smart : ఏఐ కెమెరా భలే ఉంది మావా.. కేవలం రూ. 6వేలకు లావా కొత్త ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
Lava Yuva Smart : లావా యువ స్మార్ట్ అద్భుతమైన కెమెరా ఫీచర్లతో కేవలం రూ. 6వేలకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పెద్ద 6.75-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్, 5,000mAh బ్యాటరీ, యూనిసోక్ 9863ఎ సీపీయూ ఉన్నాయి.

Lava Yuva Smart
Lava Yuva Smart : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? స్వదేశీ మొబైల్ తయారీ కంపెనీ భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్‌లో లావా యువ స్మార్ట్ కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. కంపెనీ యువ లైనప్‌లో ఇదే లేటెస్ట్ మోడల్. 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్‌తో రన్ అవుతుంది. రూ. 10వేలు అంతకంటే తక్కువ సెగ్మెంట్‌లో మార్కెట్లోకి రిలీజ్ అయింది. 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.75-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది.
Read Also : Deepseek AI: ఒక్క రోజే అమెరికన్ కంపెనీల రూ.8,65,20,50,00,00,000 డబ్బులు ఫసక్.. ఏంటీ చైనా డీప్ సీక్ ఏఐ
యువ స్మార్ట్‌లో 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉందని, దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సపోర్టుతో పనిచేస్తుందని లావా పేర్కొంది. ముఖ్యంగా, డిసెంబర్‌లో లావా యువ 2 5జీని ప్రవేశపెట్టిన తర్వాత ఇటీవలి నెలల్లో భారత్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు యువ లైనప్‌లో ప్రవేశపెట్టిన రెండో ఫోన్ ఇది. ఇంతకీ ఈ లావా యువ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్‌లో లావా యువ స్మార్ట్ ధర :
లావా యువ స్మార్ట్ ధర రూ.6వేల ప్రారంభ ధరతో ఆవిష్కరించింది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మొత్తం గ్లోసీ బ్లూ, గ్లోసీ లావెండర్, గ్లోసీ వైట్ అనే మూడు రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. కంపెనీ ఒక ఏడాది వరకు వారంటీ, ఉచిత సర్వీసును మీ ఇంటి దగ్గరుకు వచ్చి అందిస్తుంది అనమాట.
లావా యువ స్మార్ట్ స్పెసిఫికేషన్స్ :
లావా యువ స్మార్ట్ 60Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.75-అంగుళాల (720×1600 పిక్సెల్స్) హెచ్‌డీ+ స్క్రీన్‌ను కలిగి ఉంది. యూనిసోక్ 9863ఎ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఆధారితమైనది. 3జీబీ+3జీబీ (వర్చువల్) ర్యామ్, 64జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 గోలో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.
Read Also : Deepseek AI : డీప్‌సీక్ ఏఐ.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ చైనా స్టార్టప్ కంపెనీ గురించి 10 ఆసక్తిర విషయాలివే
ఏఐ ద్వారా పవర్ పొందుతుందని హెచ్‌డీఆర్ పోర్ట్రెయిట్, నైట్ మోడ్‌లకు సపోర్టు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా పొందుతుంది. వాటర్ డ్రాప్-స్టైల్ నాచ్‌లో ఉంది. కెమెరా సిస్టమ్ లావా ప్రకారం.. స్లో-మోషన్ వీడియో, ఏఐ మోడ్‌ల వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది.
కనెక్టివిటీ పరంగా లావా యువ స్మార్ట్ డ్యూయల్ 4జీ వీఓఎల్టీఈ, వై-ఫై 5, బ్లూటూత్ 4.2, ఓటీజీ సపోర్ట్‌ను కలిగి ఉంది. యూఎస్‌బీ టైప్-సి ద్వారా 10డబ్ల్యూ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫోన్ సెక్యూరిటీలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. ఇతర ఫీచర్లలో క్యూఆర్ కోడ్ స్కానర్, బ్యాటరీ సేవర్ మోడ్ ఉన్నాయి.