Lenovo Idea Tab Pro
Lenovo Idea Tab Pro Launch : కొత్త ట్యాబ్ కొంటున్నారా? అయితే, భారత మార్కెట్లోకి లెనోవా లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో వచ్చేసింది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ 12GB వరకు ర్యామ్, మీడియాటెక్ డైమన్షిటీ 8300 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 10,200mAh బ్యాటరీని అందిస్తుంది.
డాల్బీ అట్మోస్ సపోర్టుతో క్వాడ్ JBL స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంది. లెనోవా ట్యాబ్ పెన్ ప్లస్‌తో వస్తుంది. కీబోర్డ్ కనెక్టివిటీకి పోగో-పిన్ కనెక్టర్‌లను కలిగి ఉంది. టాబ్లెట్ లెనోవా స్మార్ట్ కంట్రోల్‌కు సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, పీసీలను కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది.
భారత్‌లో ట్యాబ్ ప్రో ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో 8జీబీ + 128జీబీ ఆప్షన్‌కు ధర రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 12GB + 256GB వేరియంట్ రూ. 30,999 వద్ద లిస్టు అయింది. ఈ టాబ్లెట్ ప్రస్తుతం లెనోవా ఇండియా ఇ-స్టోర్ ద్వారా దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. అమెజాన్ మైక్రోసైట్‌లోని బ్యానర్ మార్చి 21న ఇ-కామర్స్ సైట్‌లో అమ్మకానికి వస్తుంది. అంతేకాదు.. లూనా గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో 12.7-అంగుళాల 3K (1,840×2,944 పిక్సెల్స్) LTPS ఎల్‌సీడీ స్క్రీన్‌ను 144Hz రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్, 273పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో కలిగి ఉంది. ఈ టాబ్లెట్ 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్‌సెట్‌తో 12GB వరకు ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత లెనోవా ZUI 16తో వస్తుంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 వరకు రెండు ఓఎస్ అప్‌గ్రేడ్‌లను, 2029 వరకు 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకుంటుందని కంపెనీ తెలిపింది.
ఆప్టిక్స్ విషయానికొస్తే..
లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో బ్యాక్ సైడ్ 13ఎంపీ ప్రైమరీ సెన్సార్, ఫ్రంట్ సైడ్ 8ఎంపీ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. ఈ టాబ్లెట్‌లో డాల్బీ అట్మోస్ సపోర్టుతో క్వాడ్ జేబీఎల్ స్పీకర్లు అమర్చి ఉన్నాయి. లెనోవా ట్యాబ్ పెన్ ప్లస్ స్టైలస్, ట్యాబ్ ప్రో 2-ఇన్-1 కీబోర్డ్, ఫోలియో కేస్ కూడా ఉన్నాయి. టాబ్లెట్ కీబోర్డ్ త్రి పాయింట్ పోగో-పిన్ కనెక్టర్‌ను కలిగి ఉంది. లెనోవా స్మార్ట్ కంట్రోల్ ఫీచర్‌లో షేర్ హబ్, క్రాస్ కంట్రోల్, యాప్ స్ట్రీమింగ్, స్మార్ట్ క్లిప్‌బోర్డ్ ఉన్నాయి.
వినియోగదారులు ఫైల్‌లను షేర్ చేయడమే కాదు.. కంట్రోలింగ్ చేసేందుకు, యాప్‌లను ఉపయోగించవచ్చు. అలాగే పీసీలు, స్మార్ట్‌ఫోన్‌ల వంటి కనెక్ట్ చేసిన డివైజ్‌ల్లో కంటెంట్‌ను కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు.
లెనోవా ఐడియా ట్యాబ్ ప్రోలో 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,200mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, USB టైప్-C 3.2 Gen1 పోర్ట్ ఉన్నాయి. అథెంటికేషన్ కోసం టాబ్లెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 291.8×189.1×6.9ఎమ్ఎమ్ పరిమాణంతో పాటు 615 గ్రాముల బరువు ఉంటుంది.