బంపర్ ఆఫర్ : Phone కొంటే TV ఫ్రీ

  • Publish Date - December 28, 2019 / 07:58 AM IST

అవునండి మీరు వింటున్నది నిజమే. న్యూ ఇయర్, పండుగ సీజన్ వస్తుండడంతో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఓ కంపెనీ.. తమ సెల్ ఫోన్ కొంటే.. టీవీ ఫ్రీగా తీసుకపోవచ్చని వెల్లడిస్తోంది. వినియోగదారులకు టీవీని ఉచితంగానే డెలివరీ అవుతుందని ఆ కంపెనీ ప్రకటిస్తోంది. వన్ టైం ఫ్రీ స్ర్కీన్ రీ ప్లేస్ మెంట్‌ కూడా అందిస్తోంది. 

సెల్ ఫోన్ కంపెనీల్లో LG కూడా ఒకటి. వినియోగదారులను ఆకర్షించడానికి పలు ఆఫర్లు ప్రకటిస్తుంది ఈ కంపెనీ. ఇటీవలే ఇండియాలో LG G8X ThinQ లాంచ్ చేసింది. దీని ధర రూ. 49 వేల 999. ఈ సెల్ ఫోన్ కొంటే.. 24 ఇంచుల LG LED TV ఉచితంగానే అందిస్తామని ప్రకటించింది. 2020, జనవరి 15 వరకు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది.

ఆన్ లైన్ ద్వారా కానీ..ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి వర్తిస్తుందని వెల్లడించింది. ఎల్ జీ 8 ఎక్స్ థిన్ క్యూ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులు అమెజాన్ లేదా ఆఫ్ లైన్ స్టోర్ లో కొనుక్కొన్నాక.. జనవరి 15 తేదీలోపు.. ఎల్ జీ వెబ్ సైట్ లో పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, దాని IMEI నంబర్, సీరియల్ నంబర్ తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుందని వెల్లడించింది. ఫ్రీగానే డెలివరీ అవుతుందని, ఈ ఫోన్ కొనుగోలుపై ఉచితంగా అందిస్తున్న టీవీ ఖరీదు రూ. 10 వేల 990గా ఉందని తెలిపింది. 

Read More : ప్రపంచంలోనే అతి చిన్న ల్యాప్‌టాప్‌