LG Bendable Gaming Monitor : ప్రముఖ కొరియన్ టెక్ దిగ్గజం ఎల్‌జీ ప్రపంచంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డబుల్ 5K2K ఓఎల్ఈడీ మానిటర్ ప్రవేశపెట్టింది. అదే.. అల్ట్రాగేర్ జీఎక్స్9 45జీఎక్స్990ఎ మానిటర్.. కంపెనీకి చెందిన గేమింగ్ పెరిఫెరల్స్ కలెక్షన్లలో చేరింది. మానిటర్ యాంటీ-గ్లేర్ లో రిఫ్లెక్షన్ (AGLR) వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫ్లెక్సిబుల్ మోడల్ ఆధునిక (WOLED) టెక్నాలజీ ప్రొడక్టుగా చెప్పవచ్చు.
Read Also : Coast Guard Chopper : పోర్‌బందర్‌లో కుప్పకూలిన కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం
లాస్ వెగాస్‌లో జనవరి 7న సీఈఎస్ 2025 ఈవెంట్ జరుగనుంది. ఈ సందర్భంగా ఈ బెండబుల్ మానిటర్‌లను ఎల్జీ డిస్‌ప్లే చేయనుంది. ధర వివరాలు ఇంకా అందుబాటులో లేవు. జనవరి 27, 2025న జరిగే ఈవెంట్‌లో ఎల్జీ మిగతా వివరాలను రివీల్ చేయనుంది.
నివేదిక ప్రకారం.. కంపెనీ వెబ్‌ఓఎస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించే మరో రెండు గేమింగ్ మానిటర్‌లు కూడా ఆవిష్కరించనుంది. “ఎల్జీ సీఈఎస్ 2025లో అల్ట్రాగేర్ జీఎక్స్9 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్యూయల్-మోడ్, స్మార్ట్ ఫీచర్‌లతో అద్భుతమైన 5K2K #OLED గేమింగ్ మానిటర్‌లు ఉన్నాయి” అని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అధికారిక గ్లోబల్ ఛానెల్ (X)లో పోస్ట్ చేసింది.
ఎల్‌జీ అల్ట్రాగేర్ జీఎక్స్9 45జీఎక్స్990ఎ ఫీచర్లు :
ఎల్‌జీ అల్ట్రాగేర్ జీఎక్స్9 45జీఎక్స్990ఎ అనేది 5K2K (5,120 x 2,160) లోకల్ రిజల్యూషన్, 21:9 యాస్పెక్ట్ రేషియోతో 45-అంగుళాల గేమింగ్ మానిటర్ కలిగి ఉంది. ఎన్‌వీఐడీఐఏ జీ-ఎస్‌వైఎన్‌సీ ఎఎండీ ఫ్రీసింక్ ప్రీమియం ప్రో సర్టిఫికేషన్‌లను కలిగిన ఈ మానిటర్‌ను ఫ్లాట్ డిస్‌ప్లే నుంచి 900ఆర్ వక్రతకి మార్చవచ్చు. గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫీచర్‌లను కలిగి ఉంది. చాలా త్వరగా 0.03ms (GtG) రెస్పాన్స్ సమయం, వివిధ రిఫ్రెష్ రేట్‌లకు సపోర్టు అందిస్తుంది.
ఎల్‌జీ అల్ట్రాగేర్ జీఎక్స్9 45జీఎక్స్950ఎ అనేది 5K2K రిజల్యూషన్‌ని కలిగిన నాలుగు వైపులా చిన్న బెజెల్స్‌తో కూడిన 800ఆర్ కర్వ్ డిస్‌ప్లే. ఈ రెండు డిస్‌ప్లేల హై పిక్సెల్ సాంద్రత అంగుళానికి 125 పిక్సెల్‌లు (PPI) ఉంటుంది. కనెక్టివిటీకి సంబంధించి ఈ డిస్‌ప్లేలు యూఎస్‌బీ-సి పోర్ట్‌లను 90డబ్ల్యూ పవర్ డెలివరీని అందిస్తాయి.
మ్యాకో ల్యాప్‌టాప్‌లను త్వరగా ఛార్జ్ చేయగలవు. అలాగే డిస్‌ప్లేపోర్ట్ 2.1, హెచ్‌డీఎంఐ 2.1. వెబ్‌ఓఎస్‌తో పాటు, ఈ మానిటర్‌లను స్మార్ట్‌టీవీలుగా ఉపయోగించుకోవచ్చు. సాధారణ 16:9 డిస్ప్లేలతో పోలిస్తే.. 21:9 కారక నిష్పత్తి మరింత ఆకర్షణీయమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. గేమింగ్ మానిటర్‌ను పూర్తిగా ఫ్లాట్ స్క్రీన్ నుంచి 900ఆర్ వక్రతతో మార్చవచ్చు.