Coast Guard Chopper : పోర్‌బందర్‌లో కుప్పకూలిన కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం

Coast Guard Chopper : కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతిచెందగా. పలువురు గాయపడినట్లు సమాచారం.

Coast Guard Chopper : పోర్‌బందర్‌లో కుప్పకూలిన కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం

Coast Guard Chopper Crashes

Updated On : January 5, 2025 / 6:36 PM IST

Coast Guard Chopper : గుజరాత్‌లోని పోర్‌బందర్ కోస్ట్ గార్డ్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు గాయపడినట్లు సమాచారం.

క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయిన రెండు నెలల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై కోస్టుగార్డు దర్యాప్తు కొనసాగుతోందని ఐసీజీ అధికారులు వెల్లడించారు.

Read Also : జగన్ విధ్వంసంతో గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు: మంత్రి నిమ్మల

మీడియా కథనాల ప్రకారం.. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ఆదివారం (జనవరి 5) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోర్ బందర్ వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి.

హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు సహా మొత్తం ముగ్గురు ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురూ దుర్మరణం చెందారు. సాయుధ దళాలు ఆపరేట్ చేసే (ALH) ధ్రువ్, బహిరంగ మైదానంలో కూలిపోయి మంటల్లో దగ్ధం కావడం విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

4 నెలల క్రితమే పోర్‌బందర్‌లో హెలికాప్టర్ ప్రమాదం :
4 నెలల క్రితం సెప్టెంబర్‌లో (ALH MK-III) హెలికాప్టర్ పోర్‌బందర్‌లో అరేబియా సముద్రంలో కుప్పకూలి ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. ఇద్దరు సిబ్బంది మృతదేహాలను తదనంతరం స్వాధీనం చేసుకున్నారు. మిషన్ కమాండ్‌లోని పైలట్ రాకేష్ కుమార్ రాణా కోసం తీవ్రంగా గాలించారు. నెల రోజులపాటు గాలించిన తర్వాత కోస్ట్ గార్డ్ ద్వారా అక్టోబర్‌లో గుజరాత్ తీరంలో పైలట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోర్‌బందర్ తీరానికి దాదాపు 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న హరి లీలా అనే మోటార్ ట్యాంకర్‌పై గాయపడిన వ్యక్తిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఛాపర్ కూలిపోయింది. రెండేళ్ల క్రితం ఆర్మీ, నేవీ, వైమానిక దళంచే నిర్వహించే ఎఎల్‌హెచ్ ధృవ్ ఛాపర్‌లో అనేక లోపాలు తలెత్తాయి.

గుర్తించిన కొన్ని భాగాలలో కొన్ని డిజైన్, మెటలర్జీ సమస్యలు ఉన్నాయి. సేఫ్టీ ఆడిట్ పూర్తయిన తర్వాత గ్రౌన్దేడ్ అయిన చాపర్లు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి. భారత నౌకాదళం, ఐఎఎఫ్, సైన్యం, కోస్ట్ గార్డ్ వద్ద మొత్తం 325 ALH ధృవ్ హెలికాప్టర్లు ఉన్నాయి. 2023లో జరిగిన ప్రమాదాల సంఘటనల తరువాత వాటన్నింటికీ సాంకేతికపరమైన తనిఖీలు నిర్వహించారు.

2002లో భారత వైమానిక దళంలోకి :
అనేక సంవత్సరాల పరీక్షా విమానాల తర్వాత 2002లో భారత వైమానిక దళంలోకి ఈ కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్ చేరింది. ఈ హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు సహా 12 మంది కూర్చోవచ్చు. సైనిక, పౌర ప్రయోజనాల కోసం ఈ హెలికాప్టర్ ఉపయోగించవచ్చు. ధృవ్ హెలికాప్టర్‌లో యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను కూడా అమర్చవచ్చు. అంతేకాకుండా, గాలి నుంచి గగనతలానికి క్షిపణులను కూడా దీని నుంచి ప్రయోగించవచ్చు. ధృవ్ హెలికాప్టర్ విభాగంలో అత్యుత్తమ హెలికాప్టర్‌గా చెప్పవచ్చు.

Read Also : Jharkhand Cold Wave : జార్ఖండ్‌లో చలిపంజా.. 8వ తరగతి వరకు అన్ని స్కూళ్లు మూసివేత.. ఎప్పటినుంచంటే?