రూ.10,000 లోపే 5 బెస్ట్ కెమెరాల ఫోన్స్..

  • Published By: sreehari ,Published On : August 29, 2020 / 07:48 PM IST
రూ.10,000 లోపే 5 బెస్ట్ కెమెరాల ఫోన్స్..

Updated On : August 29, 2020 / 8:52 PM IST

Best Quad camera phones in India in 2020 : క్వాడ్ కెమెరా ఫోన్ల కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో క్వాడ్ కెమెరా ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది.. 2020లో బెస్ట్ క్వాడ్ కెమెరా ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం దాదాపు చాలా మార్కెట్లపై పడింది. కానీ, స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఆన్ లైన్ ద్వారా తమ కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నారు.



భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు మొబైల్ కంపెనీలు 2020 ఏడాదిలోనూ బెస్ట్ క్వాడ్ కెమెరా ఫోన్లను విడుదల చేశాయి.. ఈ ఫోన్‌లలో ఆకర్షణీయమైన కెమెరా ఫీచర్లు, పవర్ ఫుల్ బ్యాటరీ సామర్థ్యం, ​​స్ట్రాంగ్ ప్రాసెసర్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.



ధర పరంగా చూసినా కూడా చాలా తక్కువగా భారత మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ ఏడాదిలో రిలీజ్ అయిన రూ.10వేల లోపు బెస్ట్ క్వాడ్ కెమెరా ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. వీటిలో మీకు నచ్చిన ఫోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏయే ఫోన్లు అందుబాటులో ఉన్నాయో ఓసారి లుక్కేయండి..

1. Realme C15 :
రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD+ ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కారక నిష్పత్తి 20:9 కలిగి ఉంది. మెరుగైన పనితీరు కోసం, ఫోన్ మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. 13 MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP మాక్రో లెన్స్, బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్లకు క్వాడ్ కెమెరా సెటప్ లభించింది.

Realme C15 ఈ స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ సైడ్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. రియల్‌మి C15‌లో కనెక్టివిటీ Wi-fi,బ్లూటూత్ 5.0, GPS,Micro-USB పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000 mAh బ్యాటరీ ఉంది. Realme C15లో స్మార్ట్‌ఫోన్ 3GB + 32GB వేరియంట్‌ ధర రూ. 9,999 కాగా.. 4GB + 64GB వేరియంట్‌ ధర రూ .10,999లకే లభ్యం అవుతోంది.

2. Xiaomi Redmi 9 Prime :
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ స్మార్ట్ ఫోన్ల బడ్జెట్ విభాగంలో Xiaomi Redmi 9 Prime సరికొత్త స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో వచ్చింది. దీని ధర మార్కెట్లో రూ. 9,999 కాగా.. 4GB + 128GB ధర రూ. 11,999 లభ్యం అవుతోంది. 6.53-అంగుళాల Full HD+ IPS డిస్‌ప్లేతో పాటు 1,080×2,340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వచ్చింది.

Xiaomi Redmi 9 Prime

ఈ ఫోన్ ఆక్టా కోర్ మీడియా టెక్ హెలియో G80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. GPU MALI- G52తో తో వచ్చింది. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది.. కెమెరాల విషయానికి వస్తే.. 13MP ప్రధాన కెమెరాను f / 2.2 ఎపర్చర్‌తో కూడిన AI క్వాడ్ కెమెరా Array ఇచ్చింది.



8MP అల్ట్రా-వైడ్ కెమెరా +5MP మాక్రో షూటర్ + 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉంది. అద్భుతమైన సెల్ఫీల కోసం ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాలతో వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో వచ్చింది. 1820 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 380V సర్జ్ ప్రొటెక్షన్ ఛార్జర్‌తో 5020mAh బ్యాటరీ సామర్థ్యంతో భారీ బ్యాటరీతో పనిచేస్తుంది.

గొరిల్లా గ్లాస్3 TUV సర్టిఫైడ్ అయింది. ఫోన్ మాట్ బ్లాక్, స్పేస్ బ్లూ, సన్‌రైజ్ ఫ్లేర్ మింట్ గ్రీన్ సహా నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది. షియోమి ప్రీ-ఇన్‌స్టాల్డ్ స్క్రీన్ ప్రొటెక్టర్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వైర్‌లెస్ FM రేడియో కూడా ఉంది.

3. Infinix Hot 9 Pro :
ఈ మోడల్ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల Full HD+ పంచ్ హోల్ డిస్‌ప్లే ఉంది. 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హెలియో P22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 10 పవర్‌తో పనిచేసే XOS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్లకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది.

Infinix Hot 9 Pro

ఇందులో 48MP ప్రైమరీ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్ సహా తక్కువ-లైట్ సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ LED ఫ్లాష్ లైట్‌తో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 4G VoLTE, మైక్రో USB పోర్ట్, Wi-fi, బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కంపెనీ అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మార్కెట్లో ఈ ఫోన్ ధర 9,999లకే లభ్యం అవుతోంది.

4. Infinix Hot 9 :
ఈ మోడల్ స్మార్ట్ ఫోన్ 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చింది. రిజల్యూషన్ 1600 x 720 పిక్సెల్స్ గా ఉంది. పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ హెలియోP22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే XOS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. 13MP ప్రైమరీ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్, తక్కువ-లైట్ సెన్సార్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్లకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది.

Infinix Hot 9

ఈ ఫోన్ ఫ్రంట్ భాగంలో 8MP సెల్ఫీ కెమెరా అందిస్తోంది. 4G VoLTE, మైక్రో USB పోర్ట్, Wi-Fi, బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కంపెనీ అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ మోడల్ ఫోన్ మార్కెట్లో ధర రూ. 8,499లకు లభ్యం అవుతోంది.

5. Tecno Spark Power 2 :
టెక్నో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను Tecno Spark Power 2 పేరుతో భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఫోన్ 17.78-సెం.మీ (7) డిస్‌ప్లేతో స్లిమ్ బెజెల్, స్క్రీన్-టు-బాడీ రేషియో 90.6%గా ఉంది. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన Tecno Spark Power ఫోన్‌కు ఇది అప్ గ్రేడ్ వెర్షన్. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత జూన్ 17,2020 మార్కెట్లోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి, రూ. 9,999లకు అందుబాటులో ఉంది.

Tecno Spark Power 2

టెక్నో ప్రకారం.. ఈ లేటెస్ట్ ఫోన్‌కు 3 గంటల పవర్ బ్యాకప్ ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే.. 4GB ర్యామ్, 64GB ROM మెమరీతో లభిస్తోంది. 256GB వరకు ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు. కెమెరాల విషయానికి వస్తే.. 16 MP +5MP + 2 MP + AI లెన్స్‌ను బ్యాక్ కెమెరాలు ఉన్నాయి.

16MP ఫ్రంట్ కెమెరాగా అందిస్తుంది. పవర్ బ్యాకప్ సంస్థ 6000 mAh లి-అయాన్ పాలిమర్ బ్యాటరీని అందిస్తోంది. ఇందులో మీడియాటెక్ హెలియో P22 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. భారీ బ్యాటరీతో వచ్చిన ఈ మోడల్ ఫోన్.. 1 గంటలో 50శాతం ఛార్జ్ చేయవచ్చు. 20 గంటల కాలింగ్ సమయాన్ని పొందొచ్చు.. 83 గంటల వరకు మీకు నచ్చిన సాంగ్స్ వినొచ్చు.