Whatsapp Lock Chats : ఆండ్రాయిడ్ యూజర్లకు టెక్ టిప్.. ఈ కొత్త సీక్రెట్ కోడ్‌తో మీ వాట్సాప్ చాట్‌లను లాక్ చేసుకోవచ్చు!

Whatsapp Lock Chats : వాట్సాప్ యూజర్లు లాక్ చేసిన చాట్‌ల కోసం సీక్రెట్ కోడ్‌ను రూపొందించడానికి వీలుగా కొత్త పేజీని క్రియేట్ చేస్తోంది. యాప్‌లోని సెర్చ్ బార్‌లో కూడా లాక్ చేసిన చాట్‌లను గుర్తించడానికి యూజర్లను అనుమతిస్తుంది.

Whatsapp Lock Chats : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ లాక్ చేసిన చాట్‌ల కోసం కొత్త సీక్రెట్ కోడ్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మాత్రమే పనిచేస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉందని నివేదిక తెలిపింది.

(WABetaInfo) ప్రకారం.. వినియోగదారుల లాక్ చేసిన చాట్‌ల జాబితాలో ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు కొత్త సెట్టింగ్స సెక్షన్ అందుబాటులో ఉంటుంది. లాక్ చేసిన చాట్‌లను ఓపెన్ చేయడానికి యూజర్‌లకు ఎంట్రీ పాయింట్‌ను హైడ్ చేసే అవకాశం ఉంటుంది.

లాక్ చేసిన చాట్స్ ఎవరూ చూడలేరు :
నివేదిక ప్రకారం.. ప్రత్యేకంగా సీక్రెట్ కోడ్‌ను కాన్ఫిగర్ చేసిన తర్వాత లాక్ చేసిన చాట్‌లను వీక్షించే ఎంట్రీ పాయింట్ ఇకపై చాట్ జాబితాలో కనిపించదు. దానికి, బదులుగా వినియోగదారులు చాట్స్ ట్యాబ్‌లోని సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఈ చాట్‌లను యాక్సెస్ చేయవచ్చు.

Read Also : WhatsApp Privacy Protect : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. ‘ఐపీ ప్రొటెక్ట్’ ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా?

కొత్త ఫీచర్ లాక్ చేసిన చాట్‌లిస్ట్‌కు ఎంట్రీ పాయింట్‌ను తొలగించడం ద్వారా మెరుగైన ప్రైవసీని పొందేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఇతరులు లాక్ చేసిన చాట్స్ సులభంగా గుర్తించలేరు లేదా యాక్సెస్ చేయలేరు. యూజర్ సెక్యూరిటీ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తుంది. కొత్తగా లాక్ చేసిన చాట్‌ల జాబితా హైడ్ చేయడం ద్వారా ఎవరైనా యూజర్ తమ ఫోన్‌కి ఫిజికల్ యాక్సస్ పొందవచ్చు. కానీ, తమ చాట్‌లో ఎలాంటి చాట్స్ చూడలేరని గమనించాలి.

WhatsApp chats Lock 

వాట్సాప్‌లో ఐపీ ప్రొటెక్ట్ ఫీచర్ :
లాక్ చేసిన చాట్స్ జాబితాను హైడ్ చేసిన తర్వాత బహిర్గతం కాదు. ఎందుకంటే.. యాక్సెస్ ఉన్న ఎవరైనా కొన్ని లాక్ చేసిన చాట్స్ ఉండవచ్చు. రిపోర్టు ప్రకారం.. వాట్సాప్ కొత్త ‘కాల్స్‌లో ఐపీ అడ్రస్ ప్రొటెక్ట్ చేసుకునే ఆప్షన్ తీసుకొస్తోంది. వాట్సాప్ కాల్‌లో ఇతర యూజర్ల నుంచి లొకేషన్‌ను హైడ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఈ కొత్త ఆప్షన్ వాట్సాప్ సర్వర్‌ల నుంచి కాల్‌లను బ్రాడ్‌క్యాస్ట్ చేయడం ద్వారా యూజర్లు ఐపీ అడ్రస్ ఇతరుల నుంచి హైడ్ చేస్తుంది. మీ ఐపీ అడ్రస్ చూడడానికి కాల్‌లోని ఇతర యూజర్లకు ఎనేబుల్ చేస్తుంది.

Read Also : Oppo Reno 11 Series Launch : ఒప్పో రెనో 11 సిరీస్ రెండర్స్, స్పెషిఫికేషన్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు