WhatsApp Privacy Protect : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. ‘ఐపీ ప్రొటెక్ట్’ ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా?

WhatsApp Privacy Protect : వాట్సాప్‌ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. యూజర్ల ప్రైవసీ కోసం వాట్సాప్ ఐపీ ప్రొటెక్ట్ ఫీచర్ తీసుకొచ్చింది. అది ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Privacy Protect : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. ‘ఐపీ ప్రొటెక్ట్’ ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా?

How to enable WhatsApp IP Protect feature

WhatsApp Privacy Protect : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇటీవల ఐపీ ప్రొటెక్ట్ అనే కొత్త ప్రైవసీ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ మీ ఐపీ అడ్రస్‌ను వాట్సాప్ కాల్‌లో పాల్గొనే ఇతర యూజర్ల నుంచి కనిపించకుండా హైడ్ చేస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడం ద్వారా మీ కాల్‌లు నేరుగా మీ డివైజ్‌ల మధ్య కాకుండా వాట్సాప్ సర్వర్‌ల ద్వారా రన్ అవుతాయి. అంటే.. మీ లొకేషన్ ట్రాక్ చేయడం ఇతరులకు మరింత కష్టతరం చేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫీచర్ పరిమిత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Read Also : Whatsapp Search Feature : వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్.. తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేయొచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

ఐపీ ప్రొటెక్ట్ ఫీచర్‌తో కలిగే కొన్ని బెనిఫిట్స్ మీకోసం.. :

* వాట్సాప్ కాల్‌లో పాల్గొనే ఇతర యూజర్ల నుంచి మీ IP అడ్రస్ హైడ్ చేసుకోవచ్చు.
* మీ లొకేషన్ ట్రాక్ చేయకుండా ఇతరులను నివారిస్తుంది.
* మీ వాట్సాప్ కాల్‌లకు అదనపు సెక్యూరిటీని యాడ్ చేస్తుంది.
మీరు ప్రైవసీకి అడ్వాన్సడ్ లేయర్ కూడా కోరుకుంటే, మీరు వాట్సాప్ ఐపీ ప్రొటెక్ట్ ఫీచర్‌ను సులభంగా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి ఈ దిగువన పేర్కొన్న విధంగా ఫాలో అవ్వండి.

How to enable WhatsApp IP Protect feature

WhatsApp IP Protect feature

1. మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేయండి.
2. టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రి-డాట్స్ నొక్కండి.
3. సెట్టింగ్‌లపై ట్యాప్ చేయండి.
4. ‘ప్రైవసీ‘పై ట్యాప్ చేయండి.
5. అడ్వాన్సడ్ సెక్షన్ కిందికి స్క్రోల్ చేయండి.
6. కాల్స్‌లో ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఆప్షన్ ట్యాప్ చేయండి.
7. స్విచ్‌పై టోగుల్ చేయండి.

ఈ ఫీచర్ ఎనేబుల్ చేయగానే.. మీరు వాట్సాప్‌లో కాల్ చేసే యూజర్ల నుంచి మీ ఐపీ అడ్రస్ హైడ్ అవుతుంది. ఈ ఫీచర్ ద్వారా మీ లొకేషన్ ట్రాక్ చేయడం ఇతరులకు కష్టతరం అవుతుంది. దయచేసి ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడం వల్ల మీ కాల్‌ల క్వాలిటీ కొద్దిగా ప్రభావితం కావచ్చని గుర్తుంచుకోండి. ఎందుకంటే.. మీ కాల్‌లు నేరుగా మీ డివైజ్‌ల మధ్య కాకుండా వాట్సాప్ సర్వర్‌ల ద్వారా పంపడం జరుగుతుంది.

Read Also : Whatsapp Ads : వాట్సాప్‌‌లో త్వరలో స్టేటస్, ఛానల్స్‌లో యాడ్స్ చూడొచ్చు.. ఇందులో నిజమెంత?