Oppo Reno 11 Series Launch : ఒప్పో రెనో 11 సిరీస్ రెండర్స్, స్పెషిఫికేషన్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే?

Oppo Reno 11 Series Launch : ఒప్పో సరికొత్త రెనో 11 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే ఫీచర్లు, రెండర్లు లీకయ్యాయి. పూర్తి ఫీచర్లకు సంబంధించిన వివరాలను ఓసారి లుక్కేయండి.

Oppo Reno 11 Series Launch : ఒప్పో రెనో 11 సిరీస్ రెండర్స్, స్పెషిఫికేషన్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే?

Oppo Reno 11 And Reno 11 Pro Renders, Specifications Leaked

Oppo Reno 11 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో సబ్ బ్రాండ్ రెనో 11 సిరీస్ ఫీచర్లు లీకయ్యాయి. ఒప్పో కొత్త రెనో 11 సిరీస్‌ నవంబర్ 23న లాంచ్ కానుందని గతంలో లీక్ డేటా తెలిపింది. అయితే, ఒప్పో రెనో 11 లైనప్‌ ఆలస్యమైందని ఇప్పుడు, డిసెంబర్‌లో రానుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు. రాబోయే ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో రెండర్‌లు స్పెసిఫికేషన్‌లతో పాటు ఆన్‌లైన్‌లో కనిపించాయి. వనిల్లా మోడల్ హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీతో వస్తుంది. అయితే, ఒప్పో రెనో 11 ప్రో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

Read Also : Oppo A2 Launch : భారీ బ్యాటరీతో కొత్త ఒప్పో A2 ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్ల పూర్తి వివరాలు మీకోసం..!

ఒప్పో రెనో ప్రో మోడల్ కెమెరా ఫీచర్లు (అంచనా) :
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెయిబోలో ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో స్పెషిఫికేషన్‌లను లీక్ చేసింది. రెనో 11 ప్రో 1.5కె రిజల్యూషన్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్‌తో హోల్ పంచ్ స్టైల్ డిస్‌ప్లేను పొందవచ్చు. ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్‌తో పాటు స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీని కలిగి ఉండవచ్చు.

ఈ ఒప్పో రెనో ప్రో మోడల్ సోనీ ఐఎమ్‌ఎక్స్ 890 ప్రైమరీ కెమెరా, సోనీ ఐఎమ్‌ఎక్స్355 అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన సోనీ ఐఎమ్ఎక్స్709 టెలిఫోటో సెన్సార్‌ను అందించనుంది. 80డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700ఎంఎహెచ్ బ్యాటరీని అందించనుంది. ఇంకా, ఎక్స్-యాక్సిస్ మోటార్, స్టీరియో డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 190 గ్రాముల బరువు ఉంటుంది.

Oppo Reno 11 And Reno 11 Pro Renders, Specifications Leaked

Oppo Reno 11 And Reno 11 Pro Series

ఒప్పో రెనో 11 కెమెరా స్పెషిషికేషన్లు (అంచనా) :
టిప్‌స్టర్ ప్రకారం.. ఒప్పో రెనో 11 సెల్ఫీ సెన్సార్‌తో సెంటర్ హోల్ పంచ్ కటౌట్‌తో కర్వడ్ డిస్‌ప్లేతో రానుంది. వనిల్లా మోడల్ హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీని కలిగి ఉండనుంది. అంతేకాదు.. ఎల్‌వైటీ600 ప్రైమరీ కెమెరా, సోనీ ఐఎమ్‌ఎక్స్355 అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన సోనీ ఐఎమ్ఎక్స్709 టెలిఫోటో కెమెరాను పొందవచ్చు. 67డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4800ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. 184 గ్రాముల బరువు ఉంటుంది. చైనీస్ టిప్‌స్టర్ వైలాబ్ వనిల్లా ఒప్పో రెనో 11 రెండర్‌లను షేర్ చేశారు. ఒప్పో రెనో 10కి సమానమైన డిజైన్ లాంగ్వేజీని సూచిస్తున్నాయి.

కర్వడ్ ఎడ్జ్‌లతో గ్రీన్, వైట్ షేడ్స్‌లో కనిపిస్తుంది. హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో కనిపిస్తుంది. కెమెరాలు డ్యూయల్-టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు 2 రింగ్-షేప్ మాడ్యూల్స్‌లో వర్టికల్ మాదిరిగా ఉంటుంది. ఇంకా, ఒప్పో రెనో 11 మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీలో రన్ చేస్తుందని టిప్‌స్టర్ చేస్తుంది. అయితే ఒప్పో రెనో 11 ప్రో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్‌తో రావచ్చు. ఒప్పో రెనో 11 సిరీస్ లాంచ్ డిసెంబర్‌లో జరుగనుందని నివేదిక పేర్కొంది.

Read Also : Motorola Razr 40 Ultra : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్.. రెజర్ 40 అల్ట్రా కొత్త కలర్ వేరియంట్ వచ్చేసిందోచ్!