Oppo A2 Launch : భారీ బ్యాటరీతో కొత్త ఒప్పో A2 ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్ల పూర్తి వివరాలు మీకోసం..!
Oppo A2 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారీ బ్యాటరీ 5,000ఎంఎహెచ్, మీడియాటెక్ డైమెన్షిటీ 6020 ఎస్ఓసీ వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ బడ్జెట్ ఫోన్ ఫీచర్లు, ధర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Oppo A2 With MediaTek Dimensity 6020 SoC, 5,000mAh Battery
Oppo A2 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారీ బ్యాటరీతో ఒప్పో A2 ఫోన్ వచ్చేసింది. ఈ బ్రాండ్ నుంచి సరికొత్త బడ్జెట్ హ్యాండ్‌సెట్‌గా చైనాలో లాంచ్ అయింది. కొత్త ఒప్పో ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్షిటీ 6020 ఎస్ఓసీతో 12జీబీ ర్యామ్ 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో రన్ అవుతుంది.
ఒప్పో ఏ2 ఫోన్90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 50ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఇందులో ఐపీ54 డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉంది.
ఒప్పో ఏ2 ధర వివరాలు :
ఒప్పో ఏ2 బేస్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 (దాదాపు రూ. 16,500)కు అందిస్తోంది. 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ మోడల్‌తో టాప్-ఎండ్ మోడల్ ధర సీఎన్‌వై 1,799 (దాదాపు రూ. 20వేలు) ఉంటుంది. ప్రస్తుతం చైనాలో ఐస్ క్రిస్టల్ వైలెట్, జింఘై బ్లాక్, క్వింగ్బో ఎమరాల్డ్ కలర్ ఆప్షన్లలో ఒప్పో స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. భారత్ సహా ఇతర మార్కెట్లలో ఒప్పో ఏ2 లభ్యత వివరాలు ఇంకా ధృవీకరించలేదు.
ఒప్పో ఏ2 స్పెసిఫికేషన్లు :
డ్యూయల్ సిమ్ (నానో) ఒప్పో ఏ2 మోడల్ 6.72-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్‌లు) ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో గరిష్టంగా 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 391పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 680నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 91.4 స్క్రీన్ రేషియో, డిస్‌ప్లే 180హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్ వరకు అందిస్తుంది. 12జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, మాలి-జీ57 ఎమ్‌సీ2తో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 SoC ద్వారా రన్ అవుతుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ని ఉపయోగించి ఆన్‌బోర్డ్ మెమరీని 24జీబీ వరకు విస్తరించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 512జీబీ యూఎఫ్‌ఎస్2.2 స్టోరేజ్ వరకు అందిస్తుంది.

Oppo A2 Launched
ఒప్పో ఏ2 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్/1.8 ఎపర్చరు, 77-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చరు లెన్స్‌తో 2ఎంపీ సెన్సార్‌తో పాటుగా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, ఎఫ్/2.0 ఎపర్చరు లెన్స్‌తో 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఒప్పో ఏ2లోని కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై, బ్లూటూత్, యూఎస్‌బీ 2.0, 3.5ఎమ్.ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, ఏ-జీపీఎస్ ఉన్నాయి.
ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఐపీ54 రేటింగ్‌ను కూడా అందిస్తుంది. ఒప్పో ఏ2 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో 33డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ ఫోన్ కొలతలు 165.6x76x7.9ఎమ్ఎమ్, బరువు 193 గ్రాములు ఉంటుంది.
Read Also : Vivo X100 Series Launch : వివో X100 సిరీస్ ఫోన్ ఇదిగో.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!