×
Ad

Lock Google Account : గుడ్ న్యూస్.. మీ గూగుల్ అకౌంట్ లాక్ అయిందా? ఇకపై మీ ఫ్రెండ్స్‌ను అడిగి రికవరీ చేసుకోవచ్చు.. సెటప్ ఎలాగంటే?

Lock Google Account : గూగుల్ అకౌంట్ లాక్ అయినా డోంట్ కేర్.. రికవరీ కాంటాక్ట్స్ ఫీచర్ ద్వారా మీ లాక్ అకౌంట్ ఈజీగా రికవరీ చేసుకోవచ్చు..

Lock Google Account

Lock Google Account : గూగుల్ అకౌంట్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ జీమెయిల్ అకౌంట్ లాక్ అయిందా? మీ గూగుల్ అకౌంటుకు యాక్సెస్ చేయలేకపోతున్నారా? అయితే, మీరు మీ పాస్‌వర్డ్‌ను మరచిపోయినా లేదా మీ పాస్‌కీని కలిగిన డివైజ్ రాంగ్ ఉంచినా అకౌంట్ రికవరీ చేయడం కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపించవచ్చు.

ఎస్ఎంఎస్ ద్వారా వన్-టైమ్ కోడ్‌ పొందవచ్చు. ఈ ఆప్షన్లతో గూగుల్ (Lock Google Account) మీ అకౌంట్ రికవరీ చేసుకోవచ్చు. కానీ, మీ ఫోన్‌ పోగొట్టుకున్నా లేదా మీ రికవరీ ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయకపోతే ఏమి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రికవరీ కాంటాక్ట్స్ ఫీచర్ :
గూగుల్ రికవరీ కాంటాక్ట్స్‌ ఫీచర్ ప్రవేశపెట్టింది. మీ గూగుల్ అకౌంటును తిరిగి యాక్సెస్‌ చేసేందుకు ఇకపై పాస్‌వర్డ్‌లతో కాకుండా మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వొచ్చు. ఇతర రికవరీ మెథడ్స్ వర్క్ చేయకపోతే ఈ సెక్యూరిటీ ఫీచర్ ద్వారా మీ లాక్ అయిన గూగుల్ అకౌంట్ తిరిగి పొందవచ్చు.

Read Also : Best Camera 5G Phones : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌.. రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా 5G ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి!

రికవరీ కాంటాక్టు సెటప్ ఎలా? :
రికవరీ కాంటాక్ట్‌ను సెటప్ చేయడం చాలా ఈజీ. మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులతో (g.co/recovery-contacts)కి వెళ్లవచ్చు. మీరు ఎప్పుడైనా లాక్ అయితే మీ రికవరీ కాంటాక్ట్‌తో స్పెషల్ కోడ్‌ను షేర్ చేస్తారు. ఒక ఇమెయిల్ లేదా నోటిఫికేషన్‌ను అందుకుంటారు. ఈ కోడ్‌ను వెరిఫై చేయడం ద్వారా అది మీరేనని కన్ఫార్మ్ చేయొచ్చు. అయితే, మీ రికవరీ కాంటాక్ట్ ఎవరైనా సరే.. మీ పర్సనల్ అకౌంట్ లేదా ఏదైనా వ్యక్తిగత డేటాను యాక్సస్ చేయలేరు.

“వ్యక్తిగత డేటాను స్టోర్ చేయడం నుంచి సర్వీసులను కస్టమైజ్ చేయడం వరకు గూగుల్ అన్నింటికి యాక్సస్ అందిస్తుంది. మీ సాధారణ డివైజ్ లేదా పాస్‌వర్డ్ లేకపోయినా పాస్‌కీలతో ఈజీగా యాక్సెస్ చేయొచ్చని టెక్ దిగ్గజం పేర్కొంది.

పాస్‌వర్డ్‌లతో పనిలేకుండా అన్నింటికి పాస్‌కీలతోనే రికవరీ ఇష్యూ ఫిక్స్ చేసేలా గూగుల్ పనిచేస్తోంది. సాధారణ రికవరీ మెథడ్స్ వర్క్ చేయని సమయాల్లో రికవరీ కాంటాక్ట్‌ల ద్వారా అకౌంట్ తిరిగి పొందవచ్చు. ఈ కొత్త రికవరీ కాంటాక్ట్స్ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మీకు ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.