Lumio Vision 9 Mini TV : ఇంట్లోనే థియేటర్ ఫీల్.. లూమియో విజన్ 9, విజన్ 7 4K 144Hz స్మార్ట్ టీవీలు వచ్చేశాయి.. ఫీఛర్లు కిర్రాక్ భయ్యా..!
Lumio Vision 9 Mini TV : కొత్త స్మార్ట్‌టీవీలు వచ్చేశాయి. లూమియో విజన్ 9 (2026), లూమియో విజన్ 7 (2026) పేరుతో లూమియో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ రెండు మోడల్స్ డ్యూయల్ సబ్ వూపర్లతో అందుబాటులో ఉన్నాయి.
- Sreehari A
- Published on- April 16, 2026 / 05:31 PM IST
Lumio Vision 9 Mini TV
- లూమియో విజన్ 9(2026) మీడియాటెక్ పెంటోనిక్ 700 చిప్‌సెట్
- 3GB DDR4 ర్యామ్, ఫాస్ట్ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్లు
- క్యూడీ మినీఎల్‌ఈడీ డిస్‌ప్లే, బ్యాంక్ ఆఫర్లు, మరెన్నో కూపన్లు
Lumio Vision 9 Mini TV : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? భారత మార్కెట్లోకి లూమియో విజన్ 9 (2026), లూమియో విజన్ 7(2026) స్మార్ట్‌టీవీ రేంజ్ లాంచ్ చేసింది. విజన్ 9 (2026) ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. లూమియో విజన్ 7(2026) అప్‌గ్రేడ్ స్టోరేజ్ కనెక్టివిటీని అందిస్తుంది. లూమియో విజన్ 9(2026), లూమియో విజన్ 7(2026) ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
లూమియో విజన్ 9 (2026), విజన్ 7 (2026) ధర ఎంతంటే? :
లూమియో విజన్ 9 (2026) 65-అంగుళాల వేరియంట్ ధర రూ. 72,999కు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూపన్‌లతో (Lumio Vision 9 Mini TV) ధర రూ. 64,999గా ఉంది. 55-అంగుళాల వేరియంట్ మే నెలలో అందుబాటులోకి రానుంది.
65-అంగుళాల వేరియంట్ ఏప్రిల్ 24 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి వస్తుంది. లూమియో విజన్ 7 (2026) 43-అంగుళాల వేరియంట్ ధర రూ. 29,999 కాగా, 55-అంగుళాల వేరియంట్ ధర రూ. 39,999కు పొందవచ్చు. ఈ రెండు టీవీలు ఏప్రిల్ 24 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానున్నాయి.
లూమియో విజన్ 9 (2026) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
లూమియో విజన్ 9 (2026) మీడియాటెక్ పెంటోనిక్ 700 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 3GB DDR4 ర్యామ్, ఫాస్ట్ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. యాప్‌ల మధ్య ఈజీగా మారేందుకు లాగ్-ఫ్రీ కూడా అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ టీవీలో EVA ప్యానెల్‌తో QD మినీLED డిస్‌ప్లే ఉంది. 800 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్, డాల్బీ విజన్ సపోర్ట్ కలర్ గామట్ కవరేజీతో వస్తుంది. కంపెనీ ప్రకారం.. గేమింగ్ కోసం VRR ALLMతో పాటు, 144Hz వద్ద నేటివ్ 4K 240Hz వరకు 1080pకి సపోర్ట్ చేస్తుంది.
విజన్ 9 (2026)లో హెక్సా-డ్రైవర్ సెటప్, డ్యూయల్ సబ్‌వూఫర్‌లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో 50W DGS 2.2 సిస్టమ్ ఉంది. ఈ స్మార్ట్‌టీవీ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఇందులో లూమియో కంటెంట్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ TLDR 2.0 ఫీచర్ ఉంది. ట్రెండింగ్ లిస్టు, సిఫార్సులు, అడ్వాన్స్ సెర్చ్ ఫిల్టర్‌ల వంటి ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి.
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లతో కంటెంట్ లింక్‌లు లేదా టెక్స్ట్ క్వెరీలను పంపడం ద్వారా టీవీని కంట్రోల్ చేయొచ్చు. ప్రాజెక్ట్ నియోను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్ట్ నియో అన్ని లూమియో డివైజ్‌లకు అందుబాటులోకి వస్తుంది.
లూమియో విజన్ 7 (2026) 64GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ ఇప్పుడు రెట్టింపు అయింది. ఇందులో శాటిలైట్ పోర్ట్ కూడా ఉంది. తద్వారా మీరు DD ఫ్రీ డిష్ ద్వారా 540 వరకు ఫ్రీ టీవీ ఛానెల్‌లను చూడవచ్చు. విజన్ 9 (2026) విజన్ 7 (2026) మోడల్‌లు రెండూ రెండేళ్ల వారంటీతో వస్తాయి.
