Upcoming E-SUV Launch : కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా నుంచి రెండు కొత్త ఇ-ఎస్‌యూవీ మోడల్స్ వచ్చేస్తున్నాయి!

Upcoming E-SUV Launch : బ్యాటరీతో నడిచే ఎస్‌యూవీ రెండు చివర్లలో కనెక్ట్ అయ్యే ఎల్ఈడీ లైట్ సెటప్‌తో వస్తుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్, డీఆర్ఎల్ కలిసి ఉండవచ్చు.

Mahindra Release New Teaser of Upcoming E-SUVs for India

Upcoming E-SUV Launch : ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీఈ 6ఇ, ఎక్స్ఈవీ 9ఇ కొత్త టీజర్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసింది. బ్రాండ్ షేర్ చేసిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ 26న లాంచ్‌ను ఏర్పాటు చేశారు. లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ ధర వివరాలను కూడా వెల్లడించవచ్చునని భావిస్తున్నారు.

ట్విట్టర్‌లో మహీంద్రా లేటెస్ట్ టీజర్‌ను షేర్ చేస్తూ క్యాప్షన్‌.. “సాటిలేని పనితీరు. మిస్సబుల్ డిజైన్. మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఎస్‌యూవీ కొత్త శకానికి నాంది పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. మహీంద్రా ఎలక్ట్రిక్ గ్లోబల్ ప్రీమియర్ సాక్షిగా నవంబర్ 26, 2024న అన్‌లిమిట్ ఇండియాలో ఆరిజిన్ ఎస్‌యూవీ– బీఈ 6ఇ ఎక్స్ఈవీ 9ఇ మోడల్స్ ఉన్నాయి. క్లిప్ ఎక్స్‌ఈవీ 9ఇతో వస్తుంది.

బ్యాటరీతో నడిచే ఎస్‌యూవీ రెండు చివర్లలో కనెక్ట్ అయ్యే ఎల్ఈడీ లైట్ సెటప్‌తో వస్తుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్, డీఆర్ఎల్ కలిసి ఉండవచ్చు. క్లిప్ ఆకట్టుకునే అల్లాయ్ వీల్స్‌ను కూడా సూచించింది. డైమండ్-కట్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. మహీంద్రా ఎస్‌యూవీ కొత్తగా లాంచ్ అయిన టాటా కర్వ్‌ని పోలిన మొత్తం కూపే-స్టైల్‌ను సూచిస్తుంది. ఈవీ పక్కపక్కన తగిన పరిమాణపు క్లాడింగ్‌తో మరింత బోల్డ్‌గా కనిపిస్తుంది.

మొత్తం సైజు, బ్యాటరీ (అంచనా) :
రిమోర్‌ను విశ్వసిస్తే.. ఎక్స్‌యూవీ 9ఇ 4740ఎమ్ఎమ్ పొడవు, 1,900ఎమ్ఎమ్ వెడల్పు 1,760ఎమ్ఎమ్ పొడవు, 2,775ఎమ్ఎమ్ వీల్‌బేస్‌ను పొందుతుంది. ఇ-ఎస్‌యూవీ 60kWh నుంచి 80kWh వరకు బ్యాటరీ ప్యాక్‌లను పొందే అవకాశం ఉంది. యూనిట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 500కి.మీల రేంజ్‌ను అందించవచ్చు.

Read Also : Apple iPhone 16 Sale : అమెజాన్‌లో ఐఫోన్ 16పై అదిరే డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?