Tech Star Shahrukh : ఈ సింపుల్ ట్రిక్‌తో దొంగలు కొట్టేసిన 2 ఫోన్లు భలే పట్టేశాడు.. నువ్వు సూపర్ బ్రో..!

Tech Star Shahrukh : గత ఏడాది రంజాన్ ఇఫ్తార్ కోసం ఢిల్లీలోని జామా మసీదును సందర్శించిన టెక్ స్టార్ షారుక్ తాను పోగొట్టుకున్న రెండు స్మార్ట్‌ఫోన్‌లను సింపుల్ ట్రిక్‌తో ఎలా కనిపెట్టాడో రివీల్ చేశాడు.

Man Loses iPhone 13, Xiaomi Civi 2 At Delhi's Jama Masjid

Tech Star Shahrukh : ఫోన్ ఎక్కడైనా పొగొట్టుకుంటే తిరిగి కనిపెట్టడం ఇంత ఈజీనా.. అందులోనూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. ఇది సాధ్యమేనా? అంటే.. అవును సాధ్యమే అని నిరూపించాడో టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్ షారుక్. సాధారణంగా దొంగలు కొట్టేసిన ఫోన్లను కనిపెట్టడం కష్టమే. కానీ, ఈ ట్రిక్ వాడి కొట్టేసిన తన రెండు ఫోన్లను క్షణాల్లో కనిపెట్టేశాడు. ఇంతకీ ఈ ట్రిక్ ఎలా అప్లయ్ చేశాడో టెక్ స్టార్ షారుక్ రివీల్ చేశాడు.

అసలేం జరిగిందంటే..
గత ఏడాదిలో రంజాన్ ఇఫ్తార్ కోసం ఢిల్లీలోని జామా మసీదును తన భార్యతో కలిసి సందర్శించాడు షారుక్. ఆ సమయంలో తన వెంట మూడు స్మార్ట్ ఫోన్లను బ్యాగులో తీసుకెళ్లాడు. అందులో ఒకటి ఆపిల్ ఐఫోన్ 13, షావోమీ సివి 2, రెడ్‌మి K50 అల్ట్రా ఫోన్ ఉన్నాయి. అయితే, అప్పటికే ఆ జామా మసీదు సందర్శకులతో కిక్కిరిసిపోయింది.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 14వేల ఫ్లాట్ డిస్కౌంట్.. అత్యంత సరసమైన ఈ డీల్ ఎలా పొందాలంటే?

ఇలాంటి రద్దీ ప్రదేశంలో తరచూ దొంగతనాలు జరుగుతుంటాయి. విలువైన వస్తువులను దొంగలు కొట్టేస్తుంటారు. ఆ విషయం తెలియక షారుక్ తన సైడు బ్యాగులో మూడు ఫోన్లను పెట్టాడు. అందులో రెండు ఫోన్ల (ఐఫోన్ 13, షావోమీ సివి2)ను దొంగలు కొట్టేశారు. ఆ విషయం గమనించిన అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. జామా మసీదు గేట్ నంబర్ 1 నుంచి బయటకు వస్తున్నప్పుడు తన సైడ్ బ్యాగ్ చైన్ ఓపెన్ చేసి ఉంది. అప్పడు తనకు ఏం చేయాలో తెలియలేదు.

‘దొంగలు.. నా ఫోన్ ఎవరో తీశారు’ అంటూ గట్టిగా అరిచాడు. తన పక్కనే ఉన్నవారికి ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేకపోయింది. అక్కడి అధికారులకు తన ఫోన్ల గురించి కంప్లయింట్ చేశాడు. పైగా అతడికే చివాట్లు పడ్డాయి. ఏమి చేయాలో తెలియక మూడో ఫోన్ నుంచి పోయిన రెండు ఫోన్లలో ఐఫోన్‌కు కాల్ చేశాడు. అయితే, ఆ ఐఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. వెంటనే తన రెండో ఫోన్ షావోమీ సివి 2కు ఫోన్ కాల్ చేశాడు. అదృష్టవశాత్తూ ఆ ఫోన్ స్విచ్ఛాఫ్ కాలేదు.

దొంగను పట్టించిన ‘షట్‌డౌన్ కన్ఫర్మేషన్’ ఫీచర్ :
ఎందుకంటే.. ఆ షావోమీ ఫోన్‌లో ‘షట్‌డౌన్ కన్ఫర్మేషన్’ ఫీచర్ ఉంది. అందుకే ఫోన్ పవర్ ఇంకా ఆన్‌లోనే ఉంది. ఆ ఫోన్ షట్‌డౌన్ చేయాలంటే పాస్‌వర్డ్ అవసరం. కొట్టేసిన దొంగ ఆ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయలేకపోయాడు. షారుక్‌కు ఇదే ప్లస్ అయింది. ఇందులోని ఈ సెక్యూరిటీ ఫీచర్ తన ఫోన్ తిరిగి పొందడంలో కీలక పాత్ర పోషించింది. వెంటనే.. (Xiaomi) వెబ్‌సైట్‌లోని ‘Find My Device’ ఫంక్షన్‌ను ఉపయోగించి.. షారుక్ పొగొట్టుకున్న ఫోన్‌ లొకేషన్ గుర్తించాడు. ఆపై (Xiaomi CIVI 2) ఫోన్ సౌండ్ ఆప్షన్ ట్యాప్ చేయగానే గట్టిగా అలారం మోగింది. కట్ చేస్తే.. జామా మసీదు గేట్ నంబర్ 2 దగ్గరే ఉంది. ఆ ఫోన్ సైలంట్ చేసేందుకు దొంగలకు ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు.

అదే సమయంలో షారుక్ ఫోన్ ఆ ఫోన్‌కు కాల్ చేశాడు.. చేసేది ఏమిలేక కొట్టేసిన సౌరవ్ శ్రీవాస్తవ్ అనే వ్యక్తి ఎట్టకేలకు కాల్ లిఫ్ట్ చేశాడు. మసీదు గేట్ నంబర్ 2 దగ్గర తనకు ఫోన్ దొరికిందని చెప్పి వెంటనే తీసుకెళ్లమని షారుక్‌కి చెప్పాడు. అప్పటికీ ఫోన్ రింగ్ మోగుతూనే ఉంది. షారుక్ అతడి వద్దకు వెళ్లి తన రెండు ఫోన్లను తీసుకున్నాడు. పోయిన రెండు ఫోన్లు దొరకడంతో సంతోషించిన షారుక్ దొంగిలించిన వ్యక్తిని ఏమి అనలేదు. పైగా థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశానని షారుక్ తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.

సాధారణంగా ఫోన్‌లు కొట్టేసిన దొంగలు స్విచ్ఛాఫ్ చేసి సిమ్ మార్చేస్తారు. కానీ, అదృష్టవశాత్తూ దొంగ అలా చేయలేదని షారుక్ తెలిపాడు. చాలామందికి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచదు. కొంచెం తెలివిగా ఆలోచించి ఆ దేవుడి దయతో ఎట్టకేలకు రెండు ఫోన్లను తిరిగి పొందాము.. అదే దొంగలు తెలివిగా ఆలోచిస్తే ఎప్పటికీ దొరికేవు కాదుగా అంటూ షారుక్ పోస్టులో తెలిపాడు. షారుఖ్ పోస్ట్‌కు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

అతడి పోస్టుపై స్పందించిన నెటిజన్లు.. షారుక్ సమయస్ఫూర్తిని అభినందిస్తున్నారు. నువ్వు సూపర్ బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మాకు మొత్తం థ్రిల్లర్ నచ్చింది. అయితే ఈ ట్రిక్ గురించి దొంగలకు తెలియకుండా ఉండాలంటే ఈ చివరి విషయం తీసివేయాలని సూచిస్తున్నారు. మరో యూజర్ దొంగలకు ఐడియాలు ఇవ్వొద్దు బ్రో అంటూ కామెంట్ చేశాడు.

Read Also : Reliance Jio : చైనా మొబైల్ కన్నా డేటా ట్రాఫిక్‌లో జియోనే నెం.1.. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌‌గా అవతరణ!

ట్రెండింగ్ వార్తలు