Apple iPhone 15 Order : ఇదేంటి భయ్యా.. ఆపిల్ స్టోర్‌లో ఐఫోన్ 15 ఆర్డర్ చేస్తే.. ఇంటికి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది..!

Apple iPhone 15 Order : అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను ఆర్డర్ చేస్తున్నారా? ఆన్‌లైన్ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త.. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్లను ఆర్డర్ చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని టెక్ దిగ్గజం సూచిస్తోంది.

Apple iPhone 15 Order : ఆన్‌లైన్‌లో కొత్త ఫోన్ కోసం ఆర్డర్ పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇటీవల ఇలాంటి మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారిక వెబ్‌సైట్లో ఫోన్ ఆర్డర్ చేసినా ఇంటికి అదే ఫోన్ డెలివరీ అవుతుందనే గ్యారంటీ లేదు. ఆన్‌లైన్ మోసగాళ్లు డెలివరీ స్కామ్‌లకు పాల్పడుతున్నారు. ఆర్డర్ చేసిన ఫోన్‌‌కి బదులుగా మరో ఫోన్ డెలివరీ చేస్తున్నారు.

లేటెస్టుగా ఇలాంటి స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంగ్లాండ్‌లోని సర్రేకు చెందిన ఎడ్ అనే వ్యక్తి కొత్త ఐఫోన్ 15 సిరీస్ కోసం అధికారిక ఆపిల్ స్టోర్‌లో ఆర్డర్ పెట్టాడు.. కానీ, ఇంటికి ఆండ్రాయిడ్ ఫోన్ డెలివరీ కావడం చూసి అతడు షాకయ్యాడు. పైకి చూసేందుకు ఐఫోన్ ఐఓఎస్ ఇంటర్‌ఫేస్ ఉండగా.. డివైజ్ మాత్రం ఆండ్రాయిడ్‌లో రన్ అవుతుందని తెలిసి కంగుతిన్నాడు.

పైకి ఐఫోన్.. లోపల ఆండ్రాయిడ్ ఫీచర్లు :

వాస్తవానికి బాధిత వ్యక్తి ఆర్డర్ చేసింది ఐఫోన్ 15 ప్రో మోడల్.. కానీ, ప్యాకేజీ చూడగానే ఐఫోన్ మాదిరిగా కనిపించే ఫేక్ ఐఫోన్ అని గుర్తించాడు. ఆపిల్, డీపీడీ నుంచి లీగల్ ట్రాకింగ్ వెరిఫికేషన్ ఇమెయిల్‌లను పొందినట్టు తెలిపాడు. థర్డ్ పార్టీ వెబ్ సైట్లలో కాదని, ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా ఆర్డర్ చేసినట్లు ఎడ్ పేర్కొన్నాడు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ 256జీబీ స్టోరేజ్‌తో నేచురల్ టైటానియంలో ఐఫోన్ 15 ప్రోని పోలి ఉండగా, దగ్గరగా పరిశీలిస్తే.. అది ఆపిల్ ఐఓఎస్ ఇంటర్‌ఫేస్‌ మాదిరిగా కనిపించే ఆండ్రాయిడ్ మోడల్ అని తేలింది.

Read Also : Humane AI Pin : ప్రపంచంలోనే ఫస్ట్ డిస్‌ప్లే-లెస్ డివైజ్.. ఇక స్మార్ట్‌ఫోన్లతో పనిలేదు.. ఈ ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే?

ఫేక్ ఐఫోన్ అని ఎలా తేలిందంటే? :
ఫేక్ ఐఫోన్లలో స్క్రీన్ ప్రొటెక్టర్ (రియల్ ఐఫోన్‌లలో మాత్రమే ఉంటుంది), డిస్‌ప్లేలో గుర్తించిన ‘చిన్‘ (ఆపిల్ కొత్త మోడల్‌లకు భిన్నంగా) ఉంటాయి. ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ప్రీఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు టిక్‌టాక్, ఆపిల్ ఎప్పుడూ చేయనిదిగా ఉంటాయి.

Man orders iPhone 15 from Apple store

క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ ‘AtWrk‘ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ అయిన ఎడ్.. ఈ సమస్యను గుర్తించిన వెంటనే పరిష్కరం కోసం ఆపిల్‌ను సంప్రదించాడు. కానీ, వారి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. తన ఆర్డర్ నంబర్‌ని ఆపిల్ డేటాబేస్‌తో క్రాస్ చెక్ చేశాడు. ఆ తర్వాత తనకు వచ్చిన ఇమెయిల్‌లో ఆర్డర్ కన్ఫర్మేషన్ పేజీని షేర్ చేశాడు. కానీ, ఆపిల్ సపోర్టు పేజీలో పెండింగ్‌ స్టేటస్ చూపిస్తోంది.

ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి :

గతంలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. టిక్‌టాక్ యూజర్ ఒకరు ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌కి బదులుగా ఆండ్రాయిడ్ ఫోన్ అందుకున్నట్టు వివరించాడు. ఆపిల్ సాధారణంగా నెలవారీ మిలియన్ల ఐఫోన్‌లను డెలివరీ చేస్తుంటుంది. అదే సమయంలో ఫేక్ ఐఫోన్లను సంబంధిత డెలివరీలకు దారితీస్తుంది.

Fake iPhone 15

ఇలాంటి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఆపిల్ తమ వినియోగదారులను హెచ్చరిస్తోంది. ఐక్లౌడ్ ఆధారాలను ఇన్‌పుట్ చేయమని సూచిస్తోంది. లేదంటే డేటాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతోంది. ముఖ్యంగా తయారీదారుల నుంచి నేరుగా అత్యంత ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ప్రస్తుతం దీనిపై ఆపిల్ దర్యాప్తు కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు అవకాశం లేకుండా ఉండేలా భద్రతపరమైన చర్యలు చేపట్టనున్నట్టు ఒక ప్రకటనలో టెక్ దిగ్గజం తెలిపింది.

Read Also : Honor X50i Plus Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో హానర్ X50i ప్లస్ ఫోన్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు