Honor X50i Plus Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో హానర్ X50i ప్లస్ ఫోన్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

Honor X50i Plus Launch : కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో హానర్ నుంచి కొత్త X50i 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.

Honor X50i Plus Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో హానర్ X50i ప్లస్ ఫోన్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

Honor X50i Plus With 108-Megapixel Camera, 35W Fast Charging

Honor X50i Plus Launch : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ హానర్ నుంచి మరో కొత్త (Honor X50i+) 5జీ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ 5జీ ఫోన్ హానర్ X50i లైనప్‌లో చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చింది. హానర్ ఎక్స్50ఐ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. 35డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

ఈ కొత్త ఫోన్ హానర్ ఎక్స్50ఐ ప్లస్ మోడల్ అదే విధమైన బ్యాటరీ, ఛార్జింగ్ స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. అందుకు బదులుగా మీడియాటెక్ డైమెన్షిటీ 6080 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : Top 8 SEO Ranking Tips : గూగుల్‌లో ర్యాంకింగ్ కోసం వెబ్‌సైట్ పోస్టులను ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఈ 8 SEO టిప్స్ తప్పక పాటించండి!

హానర్ X50i ప్లస్ ధర ఎంతంటే? :

హానర్ ఎక్స్50ఐ ప్లస్ మోడల్ ఫోన్ బేస్ 12జీబీ + 256జీబీ వేరియంట్ చైనాలో సీఎన్‌వై 1,599 (సుమారు రూ. 18,600)కు సొంతం చేసుకోవచ్చు. అయితే, 12జీబీ + 512జీబీ ఆప్షన్ ధర సీఎన్‌వై 1,799 (సుమారు రూ. 20,900) వద్ద జాబితా చేసింది. ప్రస్తుతం హానర్ చైనా వెబ్‌సైట్ ద్వారా ఈ కొత్త ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ 5జీ ఫోన్ క్లౌడ్ వాటర్ బ్లూ, ఫాంటసీ నైట్ బ్లాక్, ఇంక్ జేడ్ గ్రీన్, లిక్విడ్ పింక్ కలర్‌వేస్‌లో ఉంది.

Honor X50i Plus With 108-Megapixel Camera, 35W Fast Charging

Honor X50i Plus 108MP Camera

హానర్ ఎక్స్50ఐ ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

6.7-అంగుళాల అమోల్డ్ పూర్తి-హెచ్‌డీ ప్లస్ (2,412 x 1,080 పిక్సెల్‌లు) డిస్‌ప్లేతో, హానర్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2,000నిట్స్ గరిష్ట ప్రకాశంతో 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత (MagicOS) 7.2తో ఫోన్ రన్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీ ద్వారా 12జీబీ ర్యామ్ 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.

హానర్ ఎక్స్50ఐ ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా ఎఫ్/1.75 ఎపర్చర్‌తో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో సెకండరీ 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. కెమెరా యూనిట్‌లు వృత్తాకార ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో ఉంటాయి. వృత్తాకార కెమెరా మాడ్యూల్‌లో బ్యాక్ ప్యానెల్ రైట్ టాప్ కార్నర్‌లో కలిసి ఉంటాయి. ఫ్రంట్ కెమెరా, డిస్‌ప్లే పైభాగంలో సెంటర్-అలైన్డ్ హోల్-పంచ్, 8ఎంపీ సెన్సార్ ఉంది.

Honor X50i Plus With 108-Megapixel Camera, 35W Fast Charging

Honor X50i Plus Fast Charging

హానర్ ఎక్స్50ఐ ప్లస్ 35డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. 5జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్/ఎసి, బ్లూటూత్ వి5.1, ఓటీజీ, జీపీఎస్, ఏజీపీఎస్, క్లోనాస్, బీడౌ, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. భద్రత విషయానికి వస్తే.. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్ పరిమాణం పరిమాణం 161.05ఎమ్ఎమ్ x 74.55ఎమ్ఎమ్ x 6.78ఎమ్ఎమ్, బరువు 166 గ్రాములు ఉంటుంది.

Read Also : Samsung Galaxy A25 5G : భారత్‌కు శాంసంగ్ గెలాక్సీ A25 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?