Samsung Galaxy A25 5G : భారత్‌కు శాంసంగ్ గెలాక్సీ A25 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Samsung Galaxy A25 5G : శాంసంగ్ నుంచి మరో కొత్త గెలాక్సీ 5జీ ఫోన్ వచ్చేస్తోంది. కంపెనీ వెబ్‌సైట్ సపోర్టులో పేజీలో శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీ ఫోన్ కనిపించింది. భారత మార్కెట్లో అతి త్వరలో లాంచ్ కానుంది.

Samsung Galaxy A25 5G : భారత్‌కు శాంసంగ్ గెలాక్సీ A25 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Samsung Galaxy A25 5G Support Page Goes Live on India Website

Samsung Galaxy A25 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి సరికొత్త గెలాక్సీ A25 5జీ ఫోన్ వచ్చేస్తోంది. కంపెనీ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. కానీ,ఈ హ్యాండ్‌సెట్ మోడల్ నంబర్ (SM-A256E/DSN)తో భారత వెబ్‌సైట్‌లోని కంపెనీ సపోర్టు పేజీలో కనిపించింది. ఇటీవల ఇదే మోడల్ నంబర్‌తో బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో గెలాక్సీ ఎ25 5జీ మోడల్ ప్రత్యక్షమైంది.

Read Also : Humane AI Pin : ప్రపంచంలోనే ఫస్ట్ డిస్‌ప్లే-లెస్ డివైజ్.. ఇక స్మార్ట్‌ఫోన్లతో పనిలేదు.. ఈ ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే?

6.44-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుందని, ఎక్సినోస్ 1280 ఎస్ఓ‌సీపై రన్ అవుతుందని భావిస్తున్నారు. 25 డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000ఎంహెచ్ బ్యాటరీతో బ్యాకప్ అయ్యే అవకాశం ఉంది. గెలాక్సీ ఎ25 5జీ ఫోన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారికంగా వచ్చిన గెలాక్సీ ఎ24కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రావచ్చునని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

శాంసంగ్ ఎ25 5జీ మోడల్ ధర (అంచనా) :

శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీ మోడల్ నంబర్ ఎస్ఎమ్-ఎ256ఈ/డీఎస్ఎన్‌ని కలిగిన శాంసంగ్ హ్యాండ్‌సెట్ కంపెనీ భారత వెబ్‌సైట్‌లో గుర్తించింది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ వంటి వివరాలతో సపోర్ట్ పేజీలో వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ గత గీక్‌బెంచ్ మోడల్ నంబర్‌తో కనిపించింది. శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీ ధర ఈయూఆర్ 300 (సుమారు రూ. 26,800) నుంచి ఈయూఆర్ 400 (దాదాపు రూ. 35,700) మధ్య ఉండవచ్చు. 6జీబీ ర్యామ్+ 128జీబీ 8జీబీ ర్యామ్+ 256జీబీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.

Samsung Galaxy A25 5G Support Page Goes Live on India Website

Samsung Galaxy A25 5G Support Page

గెలాక్సీ ఎ25 ఫోన్ స్పెషిఫికేషన్లు (అంచనా) :
ఇటీవలి లీక్‌ల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీ ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ 6పై రన్ అవుతుంది. 6.44-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్‌తో పాటు ఎక్సోనస్ 1280 SoCపై రన్ అవుతుంది. శాంసంగ్ హ్యాండ్‌సెట్‌లో 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్‌ను అందిస్తుంది. 25డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంహెచ్ బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. గెలాక్సీ ఎ25 5జీ గెలాక్సీ ఎ24 అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో వియత్నాంలో 6జీబీ + 128జీబీ, 8జీబీ+ 128జీబీ స్టోరేజీ ఆప్షన్లలో రానుంది.

Samsung Galaxy A25 5G Support Page Goes Live on India Website

Samsung Galaxy A25 5G

గెలాక్సీ ఎ25 యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ద్వారా 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఇంతకుముందు, హ్యాండ్‌సెట్ 162ఎమ్ఎమ్ x 77.5ఎమ్ఎమ్ x 8.3ఎమ్ఎమ్ పరిమాణంలో ఉంటుందని మరో నివేదిక సూచించింది.

ఈ ఫోన్ లీకైన డిజైన్ రెండర్‌లు బెజెల్స్, ఫ్రంట్ కెమెరా, ముందు ప్యానెల్ ఎగువన వాటర్‌డ్రాప్ నాచ్‌ను సూచిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ కుడి అంచున ఉన్న పవర్ బటన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌గా అందించనుంది. వాల్యూమ్ రాకర్స్ కూడా కుడి అంచున ఉండనున్నాయి. గెలాక్సీ ఎ25 ట్రిపుల్ కెమెరా యూనిట్ బ్యాక్ ప్యానెల్ లెఫ్ట్ టాప్ కార్నర్‌లో వర్టికల్ మోడ్ పక్కన ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉండనుంది.

Read Also : Samsung Galaxy AI : శాంసంగ్ యూజర్లకు పండుగే.. గెలాక్సీ ఫోన్లలో కొత్త ఏఐ ఫీచర్.. మీ ఫోన్ కాల్స్ ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు!