Fb
Mark Zuckerberg : భవిష్యత్తులో ఇంటర్నెట్‌ను ఏలేది వర్చువల్ రియాలిటీయేనని ప్రూవ్ చేస్తున్నారు మెటావర్స్ కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్. మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. హాప్టిక్ గ్లోవ్స్ ధరించి ఆ వీడియోలో కనిపించారు. సాధారణంగా వీడియో గేమ్స్ మనం బయట ఉండి ఒక క్యారెక్టర్ ద్వారా ఆడుతాం. కానీ మెటావర్స్ గేమ్‌లోకి వెళ్లి నిజంగానే గేమ్ ఆడినంత అనుభూతి పొందవచ్చు. ఇప్పుడు మార్క్.. మెటావర్స్ ను యూజ్ చేసుకుని ఆడుతున్న గేమ్స్ చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది.
Read More : Irresponsible Space : చెత్త వివాదం..అమెరికా – రష్యా స్పేస్ వార్
ఒక గాడ్జెట్ లేదా డివైజ్ ద్వారా ఈ వర్చువల్ ప్రపంచంలోకే అడుగుపెట్టినప్పటికీ.. అది నిజమైన ప్రపంచమనే భావన కలిగిస్తుంది. మెటావర్స్ లో వర్చువల్ రియాలిటీ కోసం మెటాస్ రియాలిటీ ల్యాబ్స్ బృందం హాప్టిక్ గ్లోవ్స్ పై పని చేస్తోంది. వీటిని చేతులకు ధరించి గేమ్ ఆడితే నిజమైన చేతులతో ఆడుతున్నట్లే ఉంటుంది. మార్క్ జూకర్‌బర్గ్ అదే చూపించారు. టెన్షన్‌తో పాటు ఆటగాడి ఫీలింగ్స్ ను కనిపెట్టగలవు ఈ గ్లోవ్స్.
Read More : Less Courbons by Women : మహిళలు కీలక హోదాల్లో ఉంటే..గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది
మెటావర్స్ అనేది ఒక ఆన్‌లైన్ వరల్డ్ కాన్సెప్ట్. ఇందులో వ్యక్తులు ఒకే స్థలంలో ఉండాల్సిన అవసరం లేకుండా ఇతరులతో వర్చువల్‌గా కమ్యూనికేట్ కావచ్చు, ఆడుకోవచ్చు, కలిసి భోజనం చేయవచ్చు. షాపింగ్ చేయొచ్చు. కారును డ్రైవ్ చేయొచ్చు. వర్చువల్ ఆఫీస్‌లో సహోద్యోగులను కలుసుకోవచ్చు. వర్చువల్ రియాలిటీ అనేది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. దీనిపై మార్క్ తన సమయన్నంతా కేటాయిస్తున్నారు.