Self-Charging Hybrid Cars : మారుతీ సుజుకీ నుంచి సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ కార్లు..!

సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ కార్లు రానున్నాయి. ఛార్జింగ్ స్టేషన్లతో పనిలేదు. ఎప్పటికప్పుడూ ఆటోమాటిక్ గా సెల్ఫ్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇకపై ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు

Maruti Suzuki Developing Self Charging Hybrid Cars With Toyota (1)

Maruti Suzuki Self-Charging Hybrid Cars : సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ కార్లు రానున్నాయి. ఛార్జింగ్ స్టేషన్లతో పనిలేదు. ఎప్పటికప్పుడూ ఆటోమాటిక్ గా సెల్ఫ్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇకపై రోడ్డుపక్కన ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. భారత అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతీ సుజూకీ నుంచి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (HEV) రానున్నాయి. సెల్ఫ్ ఛార్జింగ్ అయ్యే హైబ్రిడ్ కార్లను మారుతీ తయారుచేస్తోంది. ఢిల్లీ ఆధారిత కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను నెమ్మదిగా మార్కెట్లోకి తీసుకోస్తోంది. ఇతర పోటీదారులైన టాటా మోటార్స్, మహీంద్రా, హుందాయ్ కంపెనీలు కూడా HEV వాహనాలు అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. ఇప్పుడు జపనీస్ కార్ మేకర్ టయోటా కూడా మారుతీతో సంయుక్తంగా సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ కార్లను తయారుచేస్తున్నాయి. ఈ మేరకు మారుతీ సుజూకీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రాహుల్ భారతీ ఒక ప్రకటనలో వెల్లడించారు. రెండు కంపెనీల భాగస్వామ్యంలో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై టెస్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వచ్చే నెల నుంచి ఈ ప్రోటోటైపులపై టయోటోతో కలిసి సంయుక్తంగా టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాహుల్ పేర్కొన్నారు.

ఈ హైబ్రిడ్ కార్ల వినియోగ నమూనాలపై వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల మౌలిక సదుపాయలు పెరిగిపోయాయని, ఈ పరిస్థితుల్లో సెల్ఫ్-ఛార్జింగ్ మిషన్ల అవసరం ఎంతైనా ఉందన్నారు. అందులో భాగంగానే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఈ సెల్ఫ్ ఛార్జింగ్ కార్లలో ఇంటర్నల్ కంబ్యూషన్ ఇంజిన్ (ICE) ద్వారా ఎనర్జీని జనరేట్ అవుతుందని, వీల్ రొటేషన్ ఫీచర్ కూడా ఉందని అన్నారు. ఇది హైబ్రిడ్ కార్లకు మరింత సామర్థ్యాన్ని ఇస్తుందని అంటున్నారు.

ICE కార్లలో కంటే బ్యాటరీ పవర్ కార్లలోనే అధిక స్థాయిలో మైలేజీ అందిస్తున్నాయని తెలిపారు. వచ్చే 10 నుంచి 15ఏళ్లలో ఈ టెక్నాలజీ మరింత పటిష్టంగా మారుతుందని రాహుల్ ఆకాంక్షించారు. అదనపు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఆధారాపడాల్సిన అవసరం లేకుండా, ఉద్గారాలను కూడా భారీగా తగ్గించగలదని భారతీ తెలిపారు.
Bitcoin : మూడు నెలల్లో తొలిసారి…దూసుకుపోతున్న బిట్ కాయిన్ ధర

2020లో యూరప్ లో సుజూకీ Swace అనే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది కూడా టయోటా భాగస్వామ్యంలోనే తయారుచేసింది. ఇరు కంపెనీల భాగస్వామ్యంలో 3.6kW బ్యాటరీ, 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. అలాగే సెల్ఫ్ ఛార్జింగ్ అవుతుంది. ఒక లీటర్ పెట్రోల్ పోస్తే 27 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చేది. మారుతీ సుజూకీతో పాటు ఇతర పోటీదారు కంపెనీలైన Volkswagen, Renault, Nissan, Honda, Kia కారు మేకర్లు ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలవైపు దృష్టిసారించలేదు. అందుకు అధికమొత్తంలో కొనుగోలు వ్యయం, తగినంత ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడమే కారణమని చెప్పవచ్చు.

మారుతి సుజుకి 2018 చివరిలో దేశవ్యాప్తంగా 50 మోడిఫైడ్ బ్యాటరీతో నడిచే Wagon R కార్లను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. 2020లో భారతదేశంలో ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రిక్ వాహనాన్ని వాణిజ్యపరంగా లాంచ్ చేయాలనకుంది. SMC జపాన్ హెడ్ క్వార్టర్ రిపోర్టు ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ప్యూర్ EV వాహనాల్లోకి అడుగుపెడుతుందని, మొదటి కారు ధర రూ.10 లక్షల కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం రూ .10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లు లేవు. మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) eKUV100 లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది, భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. కానీ ఉత్పత్తి వ్యూహాలలో మార్పు, సెమీకండక్టర్ల లభ్యత లేకపోవడంతో M&M కార్లను లాంచ్ చేయలేకపోయింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన Tata Nexon ఎలక్ట్రిక్ కారు 70 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 14-16 వారాలుగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ Nexon ధర రూ .14 లక్షల వరకు ఉంటుందని అంచనా.